Site icon NTV Telugu

Warangal: రాజస్థాన్ నుంచి దిగిపోయిన యువతుల గ్యాంగ్.. యువకులే టార్గెట్..!

Warangal

Warangal

సాధారణంగా యువకులకు బెదిరింపులకు దిగడం.. డబ్బులు వసూలు చేసిన ఘటనలు వెలుగు చూస్తుంటాయి.. అయితే, వరంగల్‌లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువతకులు రోడ్లపై కనిపిస్తున్నారు.. సిటీలో తిరుగతూ.. యువకులను బెదిరిస్తున్నారు.. పేదవారికి సహాయం చేయండి అని అడుగుతూ.. ఏదో స్వచ్ఛందం సంస్థల పేర్లు చెబుతూ గట్టిగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు.. అనుమానం వచ్చిన స్థానికులు వారిని నిలదీశారు.. మొబైల్‌ ఫోన్లలో వారిని ఫొటోలు, వీడియోలు తీయడంతో అక్కడి నుంచి జారుకున్నారు.. వరంగల్ సిటీలో జరుగుతోన్న ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు..

Read Also: Mallu Bhatti Vikramarka Meet Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డికి భట్టి బుజ్జగింపులు.. బీజేపీలోకి వెళ్లొద్దు..!

ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు కానీ.. ఇవాళ రాజస్థాన్ యువతులు వరంగల్‌ సిటీలో హల్చల్‌ చేశారు. జీన్స్‌, టీ షర్ట్స్‌ ధరించి.. సిటీ రోడ్లపై తిరుగుతూ యువకులను డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు.. ట్రై సిటీ లోని పోచమ్మ మైదాన్, కాకతీయ యూనివర్సిటీ జంక్షన్, వడ్డేపల్లి చెరువు వద్ద గుంపులుగా తిరుగుతూ వసూళ్లకు పాల్పడ్డారు.. పేదవారికి సహాయం చేయండి అంటూ దబాయిస్తూ డబ్బులు అడుగుతున్నారు.. అప్పటికే డబ్బులు ఇచ్చిన వారి జాబితా చూపుతూ డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు.. కొందరు వారితో ఎందుకని జేబు గుల్లు చేసుకుంటే.. మరికొందరు వారిని నిలదీశారు.. అనుమానం వచ్చి ఫోటోలు తీశారు.. వాడితో మాట్లాడుతూ వీడియో చిత్రీకరించారు.. ఇదేదో.. తమ బాగోతాన్ని బయటపెట్టాలా ఉందని గమనించిన రాజస్థాన్‌ యువతుల గ్యాంగ్‌ అక్కడి నుంచి మెల్లిగా జారుకునే ప్రయత్నం చేయగా పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.. కాగా, కొద్ది రోజులుగా అపరిచిత యువతులు నగరంలో తిరుగుతూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వరంగల్‌ వాసులు చెబుతున్నారు..

Exit mobile version