Site icon NTV Telugu

Yashwant Sinha: నేడు భాగ్య‌న‌గ‌రానికి సిన్హా.. స్వాగతానికి టీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు

Yashwanth12

Yashwanth12

నేడు భాగ్య‌న‌గ‌రానికి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రానున్నారు. ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు య‌శ్వంత్ సిన్హా చేరుకుంటారు. సిన్హాకు స్వాగ‌తం ప‌లికేందుకు స్వ‌యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్ల‌నున్నారు. అనంత‌రం బేగం పేట్ నుంచి య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ద‌తుగా టిఆర్ఎస్ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి యశ్వంత్ సిన్హా భోజనం చేయనున్నారు. అనంతరం 3.30 గంటలకు ఐటీసీ కాకతీయలో ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశమై రాత్రి బెంగుళూరుకు చేరుకోనున్న యశ్వంత్ సిన్హా.

READ ALSO: Traffic diversion in Hyderabad: నగరానికి వీఐపీలు.. ఈ రూట్లలో వెళితే బెటర్..

యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాల‌ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్లు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ చేసిన విష‌యం తెలిసిందే. జూన్ 27న యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో ఆయ‌న‌తో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అయితే.. మరోవైపు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్ధిగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేయగా, ఈనెల 24న నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రప‌తి అభ్య‌ర్తి య‌శ్వంత్ సిన్హా హైద‌రాబాద్ రానున్న నేప‌థ్యంలో.. ప్రగతిభవన్‌లో న‌గ‌రంలోని ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు జూలై 2న స్వాగత ఏర్పాట్లపై చర్చించారు. ఈనేప‌థ్యంలో బేగంపేట నుంచి జలవిహార్ వరకు భారీ ర్యాలీకి టీఆర్ఎస్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. మరోవైపు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్ధిగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేయగా, ఈనెల 24న నామినేషన్ దాఖలు చేశారు.

Exit mobile version