Yadagirigutta Temple: యాదగిరిశుడి ఆలయంలో రేపటి (ఈనెల 20) నుంచి 22వ తేదీ వరకు లక్ష్మీనరసింహస్వామి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. యాదగిరిగుట్టతో పాటు అనుబంధ ఆలయాలైన పాతగుట్ట, దబ్బకుంటపల్లిలో కూడా వార్షికోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ ఉదయం స్వస్తివచనం, పుణ్యాహవచనం, లక్షకుంకుమార్చన పూజలతో పాటు తిరువేంకటపతి అలంకార సేవాోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం మృత్స్యుంగ్రహణం, అంకురార్పణ, హవనం, గరుడ వాహనం, పరవాసుదేవ అలంకార సేవలు నిర్వహిస్తారు.
21న ఉదయం నిత్యమూలమంత్ర హవనం, లక్షపుష్పార్చన, కాళీయమర్ధన అలంకార సేవోత్సవం ఉంటాయన్నారు. సాయంత్రం నారసింహ మూల మంత్ర హవనం, నిత్య పూర్ణాహుతి, గర్భాలయంలో మూలాలకు సహస్ర కలశాభిషేకం, రాత్రి నరసింహ జయంతి, ఆవిర్భావ, మహానివేదన ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. పాతగుట్ట ఆలయం యథావిధిగా కొనసాగుతుందని ఆలయ ఈఓ తెలిపారు. దబ్బకుంటపల్లి నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 22న ఉదయం 11 గంటలకు స్వస్తివాచనం, విశ్వక్సేనపూజ, అభిషేకం, స్వామివారి కల్యాణం, మహానివేదన, తీర్థప్రసాద గోష్టి ఆశీర్వాదం ఉంటాయన్నారు.
Read also: Hyderabad Traffic: ప్రయాణికులు బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
మరోవైపు పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కరరావు ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానంలోని పలు శాఖలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ యేతర వస్తువులను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ఈ నిషేధాన్ని పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. దీని ప్రకారం ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్ల స్థానంలో నాన్ ప్లాస్టిక్ వస్తువులు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిత్యకల్యాణం, హోమం, జోడు సేవల వంటి వివిధ ఆర్జితసేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు.
జూన్ 1 నుంచి ఆలయంలో నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదాద్రిలో వీఐపీ బ్రేక్ దర్శనానికి భక్తులు డ్రెస్ కోడ్ పాటించాలని ఆలయ ఈఓ తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఈ నిబంధన తప్పనిసరిగా వర్తిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా నిత్యం ధర్మ దర్శనం కోసం క్యూ లైన్ లో వచ్చే భక్తులకు ఈ నిబంధన వర్తించదని పేర్కొన్నారు. ఈ విషయంలో భక్తులందరూ సహకరించాలని ఆయన కోరారు.
Warangal Airport: వరంగల్‌లో రీజియనల్ ఎయిర్ పోర్టు..?