వరద బాధితులకు నష్టపరిహారం 10 వేలు కాదు.. 25 వేలు ఇవ్వాలరి వై.ఎస్.షర్మిళ డిమాండ్ చేసారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణం న్యూ పోరేడు పల్లి కాలనీలో వైఎస్ షర్మిల పర్యటించారు. వర్షానికి తమ కాలనీ మొత్తం మునిగిపోయిందని షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేసారు కాలనివాసులు. ప్రభుత్వం ఇస్తామని చెప్పిన నష్టపరిహారం ఇంకా అందలేదని కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. రామగుండం పట్టణం లో వరదలకు కారణం కేసీఅర్ వైఫల్యమే అంటూ విమర్శించారు. అవగాహన లేకుండా ప్రాజెక్ట్ లు కట్టి ఈ పరిస్థితి తెచ్చాడని మండిపడ్డారు. వరదలతో సర్వం కోల్పోయారని, నష్టపరిహారం ఇస్తామని మరో మోసం చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. – ఇప్పటి వరకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదు ? అని షర్మిళ ప్రశ్నించారు.
నష్టపరిహారం 10 వేలు కాదు 25 వేలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా టీఆరెఎస్ పార్టీ అకౌంట్ నుంచి నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేసారు. టీఆర్‌ఎస్ అకౌంట్ లో 860 కోట్లు ఉందని, ప్రతి నెల వడ్డీ 3 కోట్లు వస్తుందని కేసీఅర్ చెప్తున్నాడని షర్మిళ ఆరోపించారు. వరదలతో ఎంతో మంది జీవితాలు ఆగం అయ్యాయని మండిపడ్డారు. కడెం ప్రాజెక్టు గేట్లు మరమత్తులు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని నిప్పులు చెరిగారు. మూడేళ్లుగా గేట్లు మార్చాలని చెప్తున్న కేసీఅర్ పట్టించుకోలేదని, గేట్లు మేనేజ్ చేసే సిబ్బంది 33 మంది ఉండాల్సిన చోట ముగ్గురు మాత్రమే ఉన్నారని షర్మిళ అన్నారు. లక్షల కోట్లు పెట్టీ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పంప్ హౌజ్ లను కూడా కాపడుకొలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చింది లేదని విమర్శించారు. కానీ.. బ్యాక్ వాటర్ తో వేల ఎకరాలకు పంట నష్టం జరిగిందని వై.ఎస్. షర్మిళ పేర్కొన్నారు.
iOS 16: ఏడు కొత్త ఫీచర్లతో కొత్త ఓఎస్.. ఆండ్రాయిడ్ తరహాలోనే!