వరద బాధితులకు నష్టపరిహారం 10 వేలు కాదు.. 25 వేలు ఇవ్వాలరి వై.ఎస్.షర్మిళ డిమాండ్ చేసారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణం న్యూ పోరేడు పల్లి కాలనీలో వైఎస్ షర్మిల పర్యటించారు. వర్షానికి తమ కాలనీ మొత్తం మునిగిపోయిందని షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేసారు కాలనివాసులు. ప్రభుత్వం ఇస్తామని చెప్పిన నష్టపరిహారం ఇంకా అందలేదని కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. రామగుండం పట్టణం లో వరదలకు కారణం కేసీఅర్ వైఫల్యమే అంటూ విమర్శించారు.…