Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సినీ పరిశ్రమలో ఉన్నట్టుండి ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరో సూర్య రాజకీయాల్లోకి రాబోతున్నారన్నది ఆ వార్తా సారాంశం. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సూర్య పొలిటికల్ ఎంట్రీపై జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ప్రస్తుతానికి ఇది కేవలం గాసిప్ మాత్రమే. అయినప్పటికీ ఒకవేళ ఈ వార్త నిజమైతే సూర్య తీసుకునే నిర్ణయాన్ని అభిమానులు పూర్తి సంతోషంతో స్వీకరిస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఒక నటుడిగా సూర్య కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉంది.
కోలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే స్టార్ హీరో దళపతి విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీతో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించి సినిమాలకు గుడ్‌బై చెప్పారు. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్, అజిత్ కుమార్ లాంటి టాప్ హీరోలు వరుసగా బ్యాక్-టు-బ్యాక్ సినిమాలు చేసే మూడ్‌లో లేరు. ఇలాంటి తరుణంలో తమిళ చిత్ర పరిశ్రమకు ఉన్న అతిపెద్ద స్టార్ హీరో సూర్య మాత్రమే. ఇటీవలే సూర్య నటించిన ‘కరుప్పు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సూర్యను ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్‌గా మళ్ళీ టాప్‌లో నిలబెట్టింది. ఇలాంటి క్రేజీ టైమ్‌లో సూర్య తన ఫోకస్‌ను పాలిటిక్స్ వైపు మళ్ళిస్తే అది యాక్టింగ్ కెరీర్‌కు ఖచ్చితంగా పెద్ద బ్రేక్ అవుతుందనడంలో సందేహం లేదు. రాజకీయం అనేది పూర్తిగా పర్సనల్ ఛాయిస్ కు సంబంధించిన విషయం అయినప్పటికీ, సూర్యను టీవీ స్క్రీన్‌పై రాజకీయ నాయకుడిగా చూడటం కంటే వెండితెరపై వైవిధ్యమైన పాత్రల్లో నటుడిగా చూడటానికే మెజారిటీ సినిమా ప్రేమికులు ఇష్టపడుతున్నారు. మరి ఈ పొలిటికల్ రూమర్స్‌పై సూర్య ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!