Telangana: వైద్య రంగంలో అద్భుతం.. భర్త మరణించిన 11 నెలల తర్వాత మాతృత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్య రంగంలో అద్భుతం చోటు చేసుకుంది. జీవితంలో ఒక్కసారైనా అమ్మ అని పిలిపించుకోవాలన్న ఓ మహిళ భర్త మరణించిన 11 నెలల తర్వాత మాతృత్వం పొందింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన ఓ జంటకు 2013లో వివాహం జరిగింది. అయితే పెళ్లయి ఏడేళ్లు దాటినా వారికి పిల్లలు పుట్టలేదు. దీంతో వీళ్లు వరంగల్‌లోని ఓ సంతాన సాఫల్య కేంద్రంలో 2020 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. అదే ఏడాది ఏడాది మార్చిలో అక్కడి వైద్యులు పరీక్షల నిమిత్తం భార్యాభర్తల నుంచి అండం, వీర్యం సేకరించి భద్రపరిచారు. అయితే 2021లో భర్త కరోనా సోకి మరణించాడు.
దీంతో పిల్లలు కావాలని తపించిన 32 ఏళ్ల మహిళ భర్త మరణంతో కృంగిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె వైద్యులను సంప్రదించింది. ఆస్పత్రిలో భద్రపరిచిన భర్త వీర్యం ద్వారా తల్లిని కావాలని భావిస్తున్నట్లు ఆమె తెలిపింది. ఈ అంశంపై న్యాయపరమైన చిక్కులు రాకుండా కోర్టు నుంచి ఆర్డర్ కూడా తెచ్చుకుంది. దీంతో గతంలో వైద్యులు భద్రపరిచిన వీర్యం ద్వారా మహిళకు 2021లో ఐవీఎఫ్ ద్వారా చికిత్స అందించారు. ఈ మేరకు ఈ చికిత్స విజయవంతం కావడంతో ఆమె ఈ నెల 11న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇలా భర్త మరణించిన 11 నెలల తర్వాత ఆమె మాతృత్వాన్ని పొందింది.
Also Read
https://ntvtelugu.com/young-girl-commited-suicide-because-of-whatsapp-status/
తాజావార్తలు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
-
Ajinkya Rahane New Innings: రిటైర్మెంట్ రోజే స్టీవ్ వా ఫోన్.. రహానే కెరీర్‌కు కొత్త మలుపు
-
Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!