Erragadda Metro station: నగరంలోని మెట్రో స్టేషన్ పై నుండి దూకి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుండి దూకి బుధవారం ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు పెట్టారు. కొందరు స్థానిక సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన మారెమ్మగా గుర్తించారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు.
Read also: చలికాలంలో రేగు పండ్లు తింటే ఇన్ని ప్రయోజనాలా!
మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. గతంలో కూడా ఓ యువతి మెట్రో పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ ఆత్మహత్యలకు సంబంధించిన కేసులు నమోదౌతున్నాయి. ఇక, చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నారు. మెట్రో స్టేషన్ వద్ద ప్రతి రోజూ వందలాది మంది రద్దీ వున్న ప్రదేశంలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో నగరవాసులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు కోరుతున్నారు.
Love Affair: ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్న ప్రేమ..