Liquor Shops Closed: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రేపు (ఆదివారం) జరగనుంది. ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నగరంలోని వైన్‌షాపులను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వైన్ షాపు యజమానులకు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు హైదరాబాద్ జిల్లాలో జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అలాగే రేపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వైన్ షాపులు మూతపడతాయన్న వార్త విని మందు బాబులు వైన్స్‌కు పరుగులు తీస్తున్నారు.
Read also: Delhi Airport: ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్.. విమానాల దారి మళ్లీంపు
అయితే.. నవంబర్ (29,30) రెండు రోజుల బంద్ కావడంతో మందుబాబులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతే కాకుండా వైన్స్ షాప్స్ యజమానులకు తీవ్రంగా నష్టపోయామంటూ వాపోయారు. అయితే ఆ రెండు రోజులు వైన్స్ షాపులు బంద్ ఉండటంతో మందు బాటిల్లు బ్లాక్ లో అమ్ముడిపోయాయి. అదే రెండు రోజుల్లో కోట్లలో సంపాదించుకున్నారు వైన్స్ షాప్ యజమానులు. అయితే అసలే వీకెండ్.. ఎంజాయ్ చేయాలంటే మందు ఉండాల్సిందే.. తాగి ఊగాల్సిందే. కానీ మందు బాబులకు పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య బ్యాడ్ న్యూస్ చెప్పడంతో నిరాశకు చెందుతున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మందు షాపులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రేపటి కోసం ఇవాళే మందులు తీసుకొనేందుకు వైన్స్ షాపుల వద్దకు జనం పరుగులు పెడుతున్నారు. అసలే రేపు అసెంబ్లీ ఎన్నికల కౌంటిగ్ ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ పరిస్థితులు నెలకొనడంతో.. ఎటువంటి సంఘటనలు తావులేకుండా ముందస్తు చర్యగా రేపు వైన్ షాపులు బంద్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Chandrababu: దుర్గమ్మ సేవలో టీడీపీ అధినేత.. నా శేష జీవితం ప్రజలకే అంకితం..