Home Guard Wife: సీసీ కెమెరా ఫుటేజీ ఎక్కడ.. వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Guard Wife: ఇప్పటి వరకు వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్టు చేయలేదు? సీసీ కెమెరా ఫూటేజి ఎందుకు చూపించడం లేదు? అని హోంగార్డు రవీందర్ భార్య సంధ్య సీరియస్ అయ్యారు. ఉస్మానియాలో హోంగార్డు రవీందర్ మృతదేహం అధికారులు పెట్టారు. దీంతో ఉస్మానియా మార్చురి వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యలో భాగంగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హోంగార్డు రవీందర్ భార్య సంధ్య మాట్లాడుతూ.. నా భర్త గత 17 ఏళ్లుగా ఎంతో సిన్సియర్గా డ్యూటీ నిర్వహించాడని కన్నీరుమున్నీరయ్యింది. నిజాయితీగా పని చేశాడు, నాకు నిబంధనలు ఉల్లంఘించానని ఫైన్ వేశాడని తెలిపారు.
నా భర్త ఫోన్ మొత్తం అన్‌లాక్ చేసి డాటా మొత్తం డిలీట్ చేశారని మండిపడింది. నా భర్త రవీందర్ ఎంతో తెలివైన వాడని, నా భర్తతో నేను మాట్లాడిన తరువాతే చంపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. నా భర్తను ఏఎస్‌ఐ నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందు లు పెట్రోల్ పోసి తగులబెట్టి చంపారని ఆరోపించారు. ఇప్పటి వరకు వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్టు చేయలేదు? సీసీ కెమెరా ఫూటేజి ఎందుకు చూపించడం లేదు? అని ప్రశ్నించారు. నా భర్తను చంపిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. హమీద్ అనే అధికారి తన వద్దకు వచ్చాడని, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకొని సిగిరెట్ తాగుతుండగా ప్రమాదం జరిగిందని చెప్పమని బెదిరించారని సంధ్య వాపోయింది. అప్పుడే బెనిఫిట్ లు అన్ని వస్తాయని.. నన్ను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని కన్నీరుమున్నీరయైంది.
Also Read
కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ మృతి చెందాడు. 70% కాలిన గాయాలతో ఉన్న రవీందర్‌కు వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే నిన్న అతని పరిస్థితి మరింత విషమంగా మారింది. ఈరోజు తెల్లవారుజామున రవీందర్ తుదిశ్వాస విడిచారు. డీఆర్‌డీవో వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో డీఆర్‌డీవో వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు డీఆర్‌డీవో అపోలో వద్ద హోంగార్డుల ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు హోంగార్డులు విధులు బహిష్కరిస్తున్నారు. రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని హోంగార్డులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!