Site icon NTV Telugu

Bandi Sanjay: పుట్టినరోజు నాడు సెక్రటేరియట్ ప్రారంభించడం ఏంటి?

Bandi Sanjay Fair On Kcr

Bandi Sanjay Fair On Kcr

Bandi Sanjay: కేసీఆర్‌ ఏమైనా దేశ నాయకుడా ఆయన పుట్టినరోజు నాడు సెకటేరియట్ ప్రారంభిస్తున్నారు. అంబేద్కర్ జయంతి నాడు సెకటేరియట్ ను ఎందుకు ప్రారంభించరు? కేసీఆర్ ఉన్న ఇబ్బంది ఏంటి అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సమావేశానికి వచ్చిన వారు నలుగురు నాలుగు స్కామ్ లో ఉన్నారని, వచ్చిన ముఖ్యమంత్రుల్లో ఒకరు లిక్కర్, ఒకరు మైనింగ్ ఒక గోల్డ్ స్కాం లో ఉన్నారని ఆరోపించారు బండి సంజయ్‌. కేటీఆర్ దావోస్ కి సినిమా షూటింగ్ కొరకు వెళ్తారని ఎద్దేవ చేశారు. ఈ కమిషన్ తట్టుకోలేక 25 వేల కోట్ల ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్ తరలిపోయిందని ఆరోపించారు. క్రిమినల్, మతత్వ పార్టీ అయిన ఎంఐఎంతో కలిసి బీ.ఆర్ ఎస్ తిరుగుతుందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. జోకర్ మాటలు మాట్లాడుతున్నారని,. ఖమ్మం సభకు 10.లక్షలు ఇస్తామని అన్నారు.. ఆయన కూడా ఎవరు రాలేదని బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాట్లాడుతుంటే అందరూ వెళ్లిపోయారని ఎద్దేవ చేశారు. సర్పంచుల కొరకు కేంద్రం కేటాయించిన నిధులను ఎత్తుకెళ్లిన దొంగ కేసీఆర్ అని ఆరోపించారు.

Read also: BJP Resolution: ప్రధాని ఆధ్వర్యంలో ప్రపంచ భవిష్యత్‌కు రక్షకుడిగా భారత్.. బీజేపీ తీర్మానం

కేసీఆర్ దొంగల ముఠా నాయకుడు, బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ బండి సంజయ్‌ మాటలు దుమారంగా మారాయి. ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ తప్పా.. బీఆర్ఎస్ సభను ఎవరు పట్టించుకోలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సభకు వచ్చిన జనాలు, నేతలు మనస్పూర్తిగా పాల్గొనలేదని ఎద్దేవ చేశారు. బెదిరించి సభను సక్సెస్ చెయ్యాలని చూసారని ఆరోపించారు. కర్నాటక మాజీ సీఎం, బీహార్ సీఎం నితీశ్ కూడా రాలేదని అన్నారు బండి సంజయ్‌. కేసీఆర్ దగ్గర ఉన్న లిక్కర్ డబ్బులు పంచుకోవడానికి జాతీయ నేతలు వచ్చినట్లున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నోట ఏ దేశం మాట వచ్చినా ఆ దేశం సర్వనాశనం అవుతుందని అన్నారు. పాకిస్థాన్ గురించి మాట్లాడితే అక్కడ తిండి గురించి కొట్లాడుకుంటున్నారని అన్నారు. దయచేసి భారత దేశం బాగుందని కేసీఆర్ నోటి వెంట ఆ మాట రావద్దని కోరుకుంటున్నానని మీడియా ముఖంగా కేసీఆర్‌ పై ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో 21 డ్యాంల నిర్మాణాలను 8 సంవత్సరాల నుండి పెండింగులో పెడుతున్నారని మండిపడ్డారు.

Read also: Assistant Loco Pilot: లోకో పైలెట్ మిస్సింగ్ మిస్టరీ.. యాభై రోజులు గడుస్తున్నా దొరకని ఆచూకీ

తెలంగాణలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదని ఎద్దేవ చేశారు. పొలం దగ్గర ఫ్రీ కరెంట్ అని, ఇంటి దగ్గర కరెంట్ కు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. డిస్క్ంలకు డబ్బులు కట్టకుండా ఫ్రీ కరెంట్ అంటున్నారని.. ముందు వాళ్లకు కట్టాల్సిన బకాయిలు చెల్లించాలని సూచించారు. ఫ్రీ కరెంట్ ఇస్తే ఆ ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. కేసీఆర్ ఒక జోకర్, ఆయన జోకర్ మాటలు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. నిన్న ఖమ్మం సభలో ఇచ్చిన స్పీచ్ గతంలో మాట్లాడిందే! కొత్తగా ఏం మాట్లాడలేదని అన్నారు. వందేభారత్ ట్రైన్ లు దేశీయంగా మేకిన్ ఇండియాలో భాగంగా తయారయ్యాయని అన్నారు. కేసీఆర్ వేషం, భాష తుపాకి రాముడు మాటలే! అని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ లను వ్యతిరేకించిన సమాజ్ వాదీ పార్టీ తో కేసీఆర్ జతకట్టాడని అన్నారు. దళితులను వంచించిన కేసీఆర్ కు వాళ్ల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.

Read also: Harish Rao: ట్విట్టర్, ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టండి.. కాలనీకే కంటి వెలుగు..

దళితులను పారిశ్రామిక వేత్తలుగా మార్చిన ఘనత బీజేపీదే అని అన్నారు బండి సంజయ్‌. దళితులకు కేసీఆర్ ఏం చేసాడో చెప్పాలని ప్రశ్నించారు. ఖమ్మం సభలో కేసీఆర్ కనీసం జై తెలంగాణ అని మాట్లాడలేదని గుర్తుచేశారు. తెలంగాణను మరచి పోయిన కేసీఆర్ తో జై తెలంగాణ అనిపిస్తామన్నారు. ఒక విషయంలో కేసీఆర్, పంజాబ్ సీఎంలు ఒకటే అని అన్నారు. ఖమ్మం సభకు వచ్చిన నలుగురు నేతలు నాలుగు స్కాంలలో ఉన్నారని ఆరోపించారు. ఒక్క నేత బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడలేదని వ్యంగాస్త్రం వేశారు. దేశంలో వచ్చేది ఆప్ ప్రభుత్వం అని కేజ్రీవాల్ ప్రకటించాడని, మరి బీఆర్ఎస్ సంగతి ఏమిటి? అని బండి సంజయ్‌ నిన్న ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
CI Muthu Yadav: లోకో పైలెట్ మిస్సింగ్.. అందువల్లే ఆచూకీ తెలియలేదన్న సీఐ

Exit mobile version