1. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750 లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,350లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 67,000
2. నేడు భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. కటక్ వేదికగా ఈ రోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
3. నేడు ఐపీఎల్ మీడియా ప్రసాద హక్కుల ఈ వేలం జరుగనుంది. ఉదయం 11 గంటలకు ఈ వేలం ప్రారంభం కానుంది. అయితే అత్యధిక బిడ్ దాఖలయ్యే వరకు కొనసాగే అవకాశం ఉంది.
4. నేటి నుంచి టీటీడీ జ్యేష్టాభిషేకం సేవాల టికెట్లను విడుదల చేయనుంది. కరెంట్ బుకింగ్‌లో రోజుకు 600 చొప్పున మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.
5. నేడు విశాఖపట్నంలో కేంద్రమంత్రి హరదీప్ సింగ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో అర్బన్ మిషన్‌పై సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశంలో ఏపీ మంత్రి జోగి రమేశ్ పాల్గొననున్నారు.
6. నేడు భీమవరంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటించనున్నారు. మోగల్లులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి కిషన్‌రెడ్డి నివాళులు అర్పించనున్నారు. అంతేకాకుండా అల్లూరి ధ్యాన మందిరాన్ని కిషన్ రెడ్డి సందర్శించనున్నారు.
7. నేడు ఢిల్లీకి ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ రానున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిపై సోనియా సహా విపక్షాలతో చర్చలు నిర్వహించనున్నారు.
8. నేడు తెలంగాణ టెట్ పరీక్ష జరుగనుంది. ఉదయం 9.30 గంటల ఫస్ట్ పేపర్, మధ్యాహ్నం 2.30 గంటలకు సెకండ్ పేపర్‌ను నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాలకు గంటముందు చేరుకోవాలని అధికారులు సూచించారు.