విశాఖ: నేటి నుంచి స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె. రెగ్యులర్ కార్మికులు ఒక రోజు విధుల బహిష్కరణ. స్టీల్ ప్లాంట్ లోపల బంద్, ర్యాలీలు, సభలపై నిషేదం.
అమరావతి: నేడు తాడేపల్లిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ. రామచంద్రాపురం, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పోరేటర్లతో భేటీకానున్న వైఎస్ జగన్. తాజా రాజకీయ పరిణామాలు, పల అంశాలపై దిశానిర్దేశం చేయనున్న జగన్.
అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ. సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం.
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.
నేడు టీటీడీ పాలకమండలి సమావేశం. 58 అంశాలపై చర్చించనున్న పాలకమండలి. కమిటీ నివేదిక ఆధారంగా స్వీమ్స్ అభివృద్ధి పనులకు ఆమోదం. స్థానిక ఆలయాల అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్.
నేడు గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక. టీడీపీ అసంతృప్తి కార్పొరేటర్లు హాజరుపై ఉత్కంఠ. ఉప మేయర్ జనసేనకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికను బహిష్కరించిన ఓ వర్గం కార్పొరేటర్లు. కోరం లేక ఇవాళ్లికి వాయిదపడ్డ కౌన్సిల్. 64వ వార్డు కార్పొరేటర్ గోవిందరెడ్డికి డిప్యూటీ మేయర్‌గా అవకాశం.
సజ్జల శ్రీధర్ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ. ఏపీ మద్యం కేసులో ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి. సజ్జల బెయిల్ పిటిషన్‌పై విచారించనున్న ఏసీపీ కోర్టు.
నేడు నూజీవీడు కోర్టులో నకిలీ పట్టాల కేసు విచారణ. వంశీ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారించనున్న కోర్టు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం. 2,3 రోజుల్లో మరిన్ని్ ప్రాంతాలకు రుతుపవనాల విస్తరణ. తెలంగాణకు రెండు రోజులు మోస్తరు వర్ష సూచన. నేడు తెలంగాణలో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఏపీకి రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం.
కడప: నేడు ప్రొద్దుటూరు లో మినీ మహానాడు. హాజరు కానున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, ప్రొద్దుటూరు పరిశీలకులు ప్రభాకర్ చౌదరి.
మంచిర్యాల : నేడు జిల్లా లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన. భీమారం లో భూ భారతి పై నిర్వహించే అవగాహన సదస్సులో పాల్గొననున్న మంత్రి.
