P2 to G2′ అంటే ఏంటి?.. మోడీ చెప్పిన మోడల్ ఇది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో నిన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా పార్టీ అగ్ర నేత, ప్రధాని మోడీ తన ప్రసంగంలో ‘P2 to G2’ అనే మోడల్ గురించి ప్రస్తావించారు. ఈ మోడల్ని దేశం మొత్తం పాటించాలని పిలుపునిచ్చారు. దీంతో నరేంద్ర మోడీ పేర్కొన్న ఈ నమూనాకి ఫుల్ఫాం ఏంటనేది ఆస్తకికరంగా మారింది. అందుకే ఇప్పుడు దాని గురించి చెప్పుకోబోతున్నాం. P2ని (రెండు Pలని) ప్రొ-పీపుల్ పాలసీస్ అని, G2ని(రెండు Gలని) గుడ్ గవర్నెన్స్ అని విశదీకరించొచ్చు.
Read Also: Minister Roja: భీమ్లానాయక్ బిగుసుకుపోయారు.. చంద్రబాబు నీరుగారిపోయారు..!
Also Read
ప్రొ-పీపుల్ పాలసీస్ అంటే ప్రజానుకూల విధానాలని, గుడ్ గవర్నెన్స్ అంటే సుపరిపాలన అని అర్థం. నాయకులు క్షేత్ర స్థాయికి వెళ్లి జనాలు, పార్టీ కార్యకర్తలు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలని, అలా చేసినప్పుడే ప్రజానుకూల విధానాలను రూపొందించగలమని, సుపరిపాలన అందించగలమని ప్రధాని మోడీ బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర, జాతీయ నేతలు తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు రెండు రోజులు వెళ్లి అక్కడే గడిపారని, ఈ పద్ధతిని ఇతర రాష్ట్రాల్లోనూ పాటిస్తే పార్టీకి ప్రయోజం కలుగుతుందన్నారు. నాయకులు జాగ్రత్తగా మసలుకోవాలని, అధికారాన్ని తలకెక్కించుకోవద్దని చెప్పారు.
“సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయటం ద్వారా ‘వన్ ఇండియా’ని సాధించారు. ఆ స్ఫూర్తితో ఇప్పుడు వన్ కంట్రీ అనే సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీపైన ఉంది. తెలంగాణతోపాటు పశ్చిమ బెంగాల్, కేరళలో బీజేపీ శ్రేణులు ఎన్నో ఆటంకాలను అధిగమిస్తూ ముందడుగు వేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దేశంలో కుటుంబ పార్టీల పాలనకు కాలం చెల్లింది. అయితే ఆయా పార్టీలను అవమానించకుండా, వాటి లోపాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి” అని ప్రధాని మోడీ ఉద్భోదించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!