Site icon NTV Telugu

Etela Rajender: హుజూరాబాద్ లో ఏం జరిగిందో మునుగోడులో అదే రిపీట్ అయ్యింది

Kcr Etala Rajender

Kcr Etala Rajender

Etela Rajender: హుజూరాబాద్ లో ఏం జరిగిందో మునుగోడు లో అదే రిపీట్ అయ్యిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. నీవూ హుజూరాబాద్ ఓటర్స్ కు పంచిన డబ్బుపై ఓటుకు నోటు కేసు పెట్టోద్దా? అని ప్రశ్నించారు. 2018 లో ఇచ్చిన అనేక హామీలు ఎందుకు అమలు చేయలేదు? అని మండిపడ్డారు. ప్రజలు మీద ప్రేమతో కేసీఆర్‌ ఏ పథకం తీసుకురాలేదు, కేవలం ఓట్ల కోసం మాత్రమె కొత్త పథకాలని ఎద్దేవ చేశారు. మునుగోడు 30 వేల ఓట్ల కోసమే ఎల్చీనగర్ 70 గజాల ఇళ్ల స్థలాలు పట్టాలని ఆరోపించారు. 2014లో ప్రజలు గడ్డి వేసింది మీకూ కాదా? మీరు ముఖ్యమంత్రి కాదా? నల్గొండ జిల్లా మునుగోడు రాష్ట్రంలో లేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. హుజురాబాద్ ఎన్నికల సమయంలో ఎన్నికల సిబ్బందికి దావత్ ఇచ్చి తాయిలాలు ఇచ్చారని అన్నారు. నా భార్య తల్లి గారి ఇంటి దగ్గర ఉంటే రాత్రి 11 గంటలకు బలవంతంగా పంపించారని ఆరోపించారు. అసలు మీ ఎమ్మెల్యే లు ఉండొచ్చు మా వాళ్ళు ఉంటే తప్పా? అని ప్రశ్నించారు ఈటెల. దేశంలో రాజుల వ్యవహరించి ప్రజలను అగౌరవ పరుస్తున్న వ్యక్తీ కేసిఆర్ అంటూ ఆరోపించారు. భార్య భర్తల ఫోన్ ఇంటావా?అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరులను భయపెట్టడం తప్పా ప్రజలకు మేలు చేసి ప్రేమను పొందే అలవాటు మీకు లేదు అని మండిపడ్డారు. మీకు నాయకులుగా డుడు బసవన్నలు కావాలని అన్నారు.

Read also: Toyota Innova Hycross: ఈ నెల 25న వస్తున్న టొయోటా ఇన్నోవా హైక్రాస్.. ఫీచర్లు ఇవే..

కనీసం నాయకులకు గౌరవం ఇవ్వలేదని అన్నారు. సంతలో సరకులగా ఎమ్మెల్యేలు ఎంపీలను కొన్నారని ఆరోపించారు. ఖమ్మంలో మిర్చి రైతులను ఎలా జైల్ లో పెట్టారో, అంగన్వాడి టీచర్స్ పై వ్యవహరించిన తీరును దేశంలో ఉన్నా మేదావులు హై కోర్టు చీఫ్ జస్టిస్, జస్టిస్ కు పంపిస్తాం అని అన్నారు. స్వయంగా జిల్లా మంత్రి టీఆర్‌ఎస్‌ కు ఓటేయక పోతే సంక్షేమ పథకాలు ఆపేస్తాం అన్నారని అన్నారు. దీని మీద ఎన్నికల కమిషన్ సుమోటగా కేసు తీసుకోక పోవడం చాలా బాధాకరమన్నారు. మునుగోడులో నైతికంగా కేసిఆర్ ఓడిపోయారని అన్నారు. మునుగోడులో గెలిచేది రాజగోపాల్ రెడ్డి అని ధీమా వక్తం చేశారు. కేసీఆర్‌ వ్యవహారాన్నీ మేము కూడా దేశ వ్యాప్తంగా తీసుకెళ్తామన్నారు. అందరూ సీఎంలకు, ప్రతి పక్ష నేతలకు, న్యాయ మూర్తులకు పంపిస్తామన్నారు. ప్రజల హృదయాల్లో రాజ్ గోపాల్ రెడ్డి ఉన్నారని అన్నారు. ఎన్నికల కమిషన్ తీరు పై కూడా బాధ కలుగుతుందని, కేసీఆర్‌ వ్యవహారం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. మునుగోడులో ఓడి పోతున్నామని తెలిసి హింసకు ప్రోత్సహించారని ఈటెల ఆరోపించారు.
Sudigali Sudheer – Rashmi: ఎక్కడికి వెళ్లినా రష్మీనే అడుగుతున్నారు

Exit mobile version