Toyota Innova Hycross unveil on November 25: ఇండియాలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కార్లలో టొయోటా ఇన్నోవా ఒకటి. ఎంపీవీ మోడళ్లలో ఇన్నావాకు ఉన్న క్రేజే వేరు. టొయోటా కంపెనీ ఇన్నోవా క్రిస్టా పేర్లలో తన ఎంపీవీ వాహనాలను తీసుకువచ్చింది. ఇండియాలో ఈ కారు విపరీతంగా అమ్ముడైంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టొయోటా తన ఇన్నోవా హైక్రాస్ కారును ఇండియన్ మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. నవంబర్ 25న ఇన్నోవా హైక్రాస్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. గతంలో పోలిస్తే అదనపు ఫీచర్లతో పాటు సరికొత్త టెక్నాలజీతో రాబోతోంది. ఇన్నోవా క్రిస్టాతో పాటు ఇన్నోవా హైక్రాస్ కార్లను సేల్ చేయబోతోంది టొయోటా.
Read Also: China: డర్టీ డ్రాగన్ .. గల్వాన్ ఘర్షణలో చనిపోయిన సైనికుల పేరుతో వంతెనలు..
హైబ్రీడ్ పవర్ ట్రెయిన్ టెక్నాలజీతో ఈ కారు వస్తోంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ తో మోనోకోక్ ఛాసిస్ కలిగి ఉండనుంది. ప్రస్తుతం వస్తున్న ఇన్నోవా హైక్రాస్, గతంలోని క్రిష్టాతో పోలిస్తే సమాన రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ.. దాని ఫ్రంట్ పోర్షన్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ ఆకర్షణీయంగా కనిపించననుంది. క్రిస్టాతో పోలిస్తే హైక్రాస్ స్పోర్టీవ్ లుక్ తో కనిపించనుంది. క్యాబిన్ స్పేస్ కూడా పెద్దగా ఉండే అవకాశం ఉంది. డిజిల్ ఇంజన్ వేరియంట్ తో ఈ హైక్రాస్ వస్తున్నట్లు సమాచారం. అయితే ఇది హైబ్రీడ్ కారుగా ఉండబోతోంది. ఇప్పటికే టొయోటా నుంచి అర్బన్ క్రూజర్ హైరైడర్ లైట్, మైల్డ్, స్ట్రాంగ్ హైబ్రీడ్ వెర్షన్లలో మార్కెట్ లో అందుబాటులో ఉంది. దీని మాదిరిగానే ఇన్నోవా హైక్రాస్ ఉండబోతున్నట్లు సమాచారం. 2.0 ఐసీఈ ఇంజన్ తో ఉంటుందని తెలుస్తోంది. అయితే హైరైడర్ మాదిరిగానే ఆల్ వీల్ డ్రైవ్ కూడా ఉండే అవకాశం ఉంది. బిగ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, సీట్ వెంటిలేషన్, 360-డిగ్రీ కెమెరా వంటి సదుపాయాలు ఉండే అవకాశం ఉంది.