వేరే పార్టీ ర్తు మీద గెలిచినా వాళ్లకు మంత్రి పదవి ఎలా కట్టబెట్టారు? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మీరెలా 8 ఏళ్లలో ప్రతిపక్షాలను పడగొట్టి చెడగొట్టరో మేము కూడా దేశంలో ఉన్న అన్ని కోర్టులకు, మేధావులకు డేటా పంపిస్తామన్నారు.
హుజూరాబాద్ లో ఏం జరిగిందో మునుగోడు లో అదే రిపీట్ అయ్యిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. నీవూ హుజూరాబాద్ ఓటర్స్ కు పంచిన డబ్బుపై ఓటుకు నోటు కేసు పెట్టోద్దా? అని ప్రశ్నించారు. 2018 లో ఇచ్చిన అనేక హామీలు ఎందుకు అమలు చేయలేదు? అని మండిపడ్డారు.