NTV Telugu Site icon

Mallu Bhatti Vikramarka: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతాం..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అలాంటి వారిపై కేసులు పెడతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని.. ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి అంటే వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ప్రజలను ఆందోళన కలిగించే ప్రచారం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.7 వేల కోట్ల బ్యాలెన్స్ ఉంది అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు.. కాని అప్పటికే ఖజానా – 3960కోట్లు ఉందని తెలిపారు. రూ. 7 వేళా కోట్లు ఎవరు తిన్నారు.. ఎటు పోయాయి.. ఎవరి అకౌంట్ లోకి పోయాయి ? అని ప్రశ్నించారు. వాస్తవాలు కప్పిపుచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. నాలుగు నెలల్లో మేము రూ.26 వేళా కోట్ల అప్పులు కట్టినామన్నారు.

Read also: Amit Shah: గాంధీనగర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన అమిత్ షా..

రూ.3927 కోట్ల పవర్ సబ్సిడీ చెల్లించామన్నారు. డైట్.. మధ్యాహ్నం భోజనం నిధులు.. మహిళా సంఘాలకు నిధులు ఇచ్చామన్నారు. ఆర్థిక పరిస్థితిపై చర్చకు నేను సిద్ధమన్నారు. మార్చి నుండి 15673 మెగావాట్ల డిమాండ్ వచ్చిందని, అయినా.. కట్ లేకుండా పవర్ అందించామని క్లారిటీ ఇచ్చామన్నారు. ఏప్రిల్..మే లో కూడా పవర్ డిమాండ్ ఎంత పెరిగినా.. అందుబాటులో ఉంచాం విద్యుత్ అని తెలిపారు. ఎన్టీపీసీ నుండి విద్యుత్జ్ ఉత్పత్తి చేసి వినియోగదారులకు అందిస్తే.. 8 నుండి 9 రూపాయల యూనిట్ ఖర్చు అవుతుందన్నారు. కానీ సోలార్ పవర్ పెడితే.. 5 రూపాయలకే వచ్చే 25 ఏళ్లకు సప్లై చేస్తాం అంటున్నాయని, అధిక రేటు ఎందుకు పెట్టినట్టు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వ్యవహారం పైశాచికతత్వం ఉందన్నారు. రూ. 20 కి యూనిట్ విద్యుత్ కొన్నదని అన్నారు. గ్రీన్ పవర్ ని రాష్ట్రానికి తక్కువ ధరకు అందిస్తామన్నారు.

Read also: Lok Sabha Election 2024 : పశ్చిమ బెంగాల్‌లో బిజెపి, టిఎంసి పరస్పర దాడులు

ఏడాది కూడా ఉండదు అంటాడు ఒకాయన.. సమస్యలు పరిష్కారం చేసే ప్రభుత్వమ్ ఉండదని అంటున్నాడు కేసీఆర్.. లకిందులు తప్పస్సు చేసినా ఢోకా లేదన్నారు. R ట్యాక్స్.. B ట్యాక్స్ పై భట్టి మాట్లాడుతూ.. తన లాంటి వాళ్ళు తపనతో రాష్ట్రాన్ని నిర్మించే పనిలో ఉన్నామన్నారు. మా లాంటి వాళ్ళను అడ్డుకోవడానికి కొందరు కుట్ర దారులు R ట్యాక్స్.. B ట్యాక్స్ అని ఆరోపిస్తున్నారని తెలిపారు. SLbc ని పదేళ్ళలో అసలు పట్టించుకోలేదు.. డిండి.. నక్కల గండి లాంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. 10 లక్షల కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలకు బట్టి కౌంటర్ ఇచ్చారు. నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే.. ఖమ్మంలో 2 లక్షల ఎకరాల భూమి ఏపీకి ఇచ్చిందని తెలిపారు. ఆర్డినెన్స్ ఇచ్చి భూములు ఇచ్చేసిందన్నారు.

Read also: Bollywood : రోడ్డు ప్రమాదానికి గురైన బాలీవుడ్ నటి..

అంబేద్కర్ ప్రాణహిత పూర్తి చేయడానికి 3 వేల ఎకరాలు భూ సేకరణ చేయాల్సి వుండే.. 10 ఏండ్లలో 10 లక్షల కోట్లు కాదు ఇచ్చిందని క్లారిటీ ఇచ్చారు. వాటా గా వచ్చిన డబ్బు 3 లక్షల 70 వేళా 235 కోట్లు అని తెలిపారు. నదిలో నా వాటా ఎంత అనేది తేల్చాలన్నారు. కానీ పదేళ్లు తేల్చలేదని, కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినా.. నాజోలికి నువ్వు..నీ జోలికి నేను రాను అని మాట్లాడుకున్నారు తప్పితే.. వాటా కోసం అడగలేదన్నారు. పేదల నుండి తీసుకున్న అసైన్డ్ భూములు వెనక్కి ఇచ్చే ప్లాన్ చేస్తున్నామని భట్టి శుభవార్త చెప్పారు. పాదయాత్రలో హామీల అమలుకు శ్రీకారం చుడతామన్నారు. రుణమాఫీ వంద రోజుల్లో చేస్తాం అనలేదని.. కానీ రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం.. త్వరలోనే రుణమాఫీ చేస్తామన్నారు.

Read also: Elections 2024:పెళ్లి దుస్తుల్లోనే వచ్చి ఓటు వేసిన వధూవరులు.. వీడియో వైరల్..

ఆర్థిక వెసులుబాటు చూసుకుంటున్నామని తెలిపారు. మేడిగడ్డ కూలింది అంటే.. అది ప్రజల లక్ష కోట్ల సొమ్ము ఉందన్నారు. ప్రజలకు తెలియకూడదా..? దాచి పెట్టడం సరికాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరమని, ఆర్థిక ప్రయోజనాల కోసం పౌరుల జీవితల్లోకి చొరబడ్డారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ లో చాలా మంది బ్లాక్ మెయిల్ చేశారని.. ఫోన్ లు విని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనేది తప్పు కాదా? అని ప్రశ్నించారు. పరిశ్రమలకు క్వాలిటీ కరెంట్ ఇస్తున్నామన్నారు. ఎవరికైనా సమస్య వస్తే..నా దృష్టికి తెండి ..పరిష్కారం చేస్తా అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అలాంటి వారిపై కేసులు పెడతామన్నారు.
Sanjay Singh : ప్రధాని పిలుపు మేరకే జైల్లోనే కేజ్రీవాల్‌ హత్యకు కుట్ర : ఆప్ ఆరోపణ

Show comments