రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. అతివేగం ప్రమాధాలకు కారణమని పోలీసులు ఎంతగా చెబుతున్నా కూడా జనాలు పట్టించుకోకుండా ప్రమాదాలను కోరి తెచ్చుకుంటారు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు రోడ్డు ప్రమాదాలకు బలి అయ్యారు.. తాజాగా మరో బాలీవుడ్ నటి రోడ్డు ప్రమాదానికి గురైంది. బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి రోడ్డు ప్రమాదానికి గురైంది. యే హై మొహబ్బతీన్ సీరియల్ గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు హింది ప్రేక్షకులకు సుపరిచితమే..
ఈ ప్రమాదం కారణంగా ఆమెకు రెండు చేతులు విరిగినట్లు తెలుస్తుంది.. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్తే వెల్లడించారు. గురువారం ఆమె ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది.. వెంటనే ఆమె ఆసుపత్రికి తరలించారు.. ఈ ప్రమాదంలో ఆమెకు చేతి ఎముకలు విరగడంతో శస్త్ర చికిత్స చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె భర్త వివేక్ దహియా వెల్లడించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అతను ఆసుపత్రికి వెళ్లాడు.
ఈ ప్రమాదం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె అభిమానులు, సెలెబ్రేటీలు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ ప్రమాదానికి గురైన ఈమె ఇప్పుడు మరో ప్రమాదానికి గురవ్వడం గమనార్హం. దివ్యాంక త్రిపాఠి తన కెరీర్‌లో పలు సీరియల్స్‌తో పాటు రియాలిటీ షోలలో పాల్గొంది.. ప్రస్తుతం ఆమె చేతులు మళ్లీ సెట్ అయ్యేవరకు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెబుతున్నారు..