NTV Telugu Site icon

Raghunandan Rao: మేం క్షమాపణ చెప్పే ప్రసక్తేలేదు.. స్పష్టం చేసిన రఘునందన్‌

Raghunandan Rao

Raghunandan Rao

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.. లేకుంటే చర్యలు తప్పవంటూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతోంది అధికార పార్టీ.. స్పీకర్ మరమనిషిలా నిర్ణయాలు తీసుకోవద్దని ఈటల రాజేందర్ స్పీకర్ ను కోరారు. స్పీకర్ ను మరమనిషిలా నిర్ణయం తీసుకోవద్దని చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.. అయితే, క్షమాపణ చెప్పేదే లేదంటున్నారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు..

Read Also: Rahul Gandhi: మతచిచ్చు పెట్టి బీజేపీ దేశాన్ని విభజించాలని చూస్తోంది.. రాహుల్‌ విమర్శలు

మా వ్యాఖ్యలకు తప్పుడు అర్థాలు తీశారని విమర్శించిన రఘునందన్ రావు… నిన్న మేం మాట్లాడిన మాటలకు పెడర్థాలు తీశారు.. మేము చేసిన తప్పు ఎంటో మాట్లాడుదాము అని నాలుగు గంటలకు రావాలని కోరాం.. సాయంత్రం వరకు ఎలాంటి స్పందన లేదన్నారు.. ఈ రోజు మీరు బిజీగా ఉన్నారని భావిస్తున్న… వచ్చే మూడు రోజుల్లో మీ వెసులు బాటును బట్టి ఎప్పుడు వస్తానని చెప్పిన నేను సిద్ధంగా ఉన్నానన్న ఆయన… మీ నుండి రూల్స్ గురుంచి చాలా నేర్చుకోవాలని అనుకుంటున్న మంత్రి గారు.. మంత్రి చెప్పిన సుద్దులు నేర్చుకోవటానికి , మార్చిన రూల్స్ తెలుసుకోవడానికి సిద్దం అని సెటైర్లు వేశారు.. ఏదేమైనా మేం క్షమాపణ చెప్పే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే రఘునందన్‌రావు.