Hussain Sagar: సాగర్‌లోకి మురుగు నీరు.. జలావరణానికి ప్రమాదముంటున్న పీసీబీ నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hussain Sagar: హైదరాబాద్ మహా నగరంలోని పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్ సాగర్‌లో రోజురోజుకు నీటి నాణ్యత తగ్గుతోంది. వర్షపు నీటి ప్రవాహం తగ్గిపోవడంతో మురుగు నీరు స్వేచ్చగా కలిసిపోయి నీరు కలుషితంగా మారిపోతోంది. ఇటీవల పడిపోతున్న నీటి నాణ్యతపై పీసీబీ విడుదల చేసిన నివేదికలోనూ అధికారులు తీసుకుంటున్న చర్యల వల్ల హుస్సేన్ సాగర్‌లో జీవనం ప్రమాదంలో పడిందని తేలింది. కాగా.. పదేళ్ల క్రితంతో పోలిస్తే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ మెరుగుపడినా.. నీటి నాణ్యత పెంపునకు ప్రత్యేక కార్యాచరణ అవసరమని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. మహానగరంలో నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్‌లో మురుగునీరు స్వేచ్చగా ప్రవహించడంతో నీటి నాణ్యత క్షీణిస్తోంది. దీనికి తోడు బంజారా నాలా ద్వారా విడుదలయ్యే శుద్ధి చేయని డ్రైనేజీ నీరు, మురుగులో ఉండే కాలుష్య కారకాలు, మెటాలిక్ సమ్మేళనాలు కారణంగా రిజర్వాయర్ పర్యావరణం దెబ్బతింటుంది. 2023లో తయారు చేసిన పీసీబీ నివేదిక ప్రకారం.. హుస్సేన్ సాగర్‌కు కీలకమైన నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో నీటి నాణ్యత అధ్వాన్నంగా ఉంది.
Read also: Srisailam: శ్రీశైలంలో ఆర్జిత సేవలన్నీరద్దు.. ఎప్పటి నుంచి అంటే..!
Also Read
ప్రధానంగా బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ తో పాటు సాలిడ్ వేస్ట్, కోలిఫాం నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అయితే, నీటి pH స్థాయి 6.63-7.63 మధ్య స్థిరంగా ఉండగా, అధిక విద్యుత్ వాహకత (EC) విలువ నీటిలోని ఖనిజ లవణాలకు విలక్షణమైనది, PCB వర్గాలు వెల్లడించాయి. పిసిబి వర్గాల ప్రకారం, నీటి నాణ్యత క్రమంగా క్షీణించడానికి ప్రధాన కారణాలు శుద్ధి చేయని మురుగునీరు మరియు మానవ వ్యర్థాల పరిమాణం. నీటిలో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పడిపోతే నీటి పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. బంజారాహిల్స్ నాలా నుంచి వచ్చే మురుగునీటితోనే హుస్సేన్ సాగర్ లో నీటి నాణ్యత తగ్గుతుందన్నారు. ఇక హుస్సేన్ సాగర్ జలాలను కాపాడాలంటే సమర్థవంతమైన ఎస్టీపీలతో పాటు, నిరంతరం ప్రవహించే మంచినీరు లేదా 100 శాతం శుద్ధి చేసిన మురుగునీటితో మాత్రమే సాధ్యమవుతుంది. అంతేకాకుండా.. వీటితో పాటు ప్రతి సంవత్సరం వేసవిలో నీరు ఆవిరైపోతుందని పీసీబీ అధికారులు చెబుతున్నారు.
TSPSC Group 2024: గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారా..? సిలబస్ ఇదే..!
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!