Nizamabad: నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం వేగంగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో.. నేటి నుంచి కాకతీయ ఆయకట్టుకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. పంట చేతికి రాలేదని, మరో తడి ఇవ్వాలని రైతులు అంటున్నారు. నీటిమట్టం తగ్గుతుందని అధికారులు సాధ్యం కాదంటున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం 13 టి.ఎం.సిలకు చేరింది. తాగునీటి అవసరాలకు 5 టి.ఎం.సీ.లు, ఆవిరి రూపంలో 2 టి.ఎం.సి లు, డెడ్ స్టోరేజికి మరో 5 టి.ఎం.సి.లు ఉంది. దీంతో రైతుల పంటలకు తాగునీటిని ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులు చెప్పడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు మండిపోతున్నాయని చుక్కనీరు లేక పంటలు ఎండుతున్నాయని రైతులు అంటున్నారు. నీరు విడుదల నిలిపివేస్తే.. చేతికొస్తున్న పంట ఎండిపోతుందని కన్నీరుపెడుతున్నారు. అధికారులు స్పందించి నీటిని వదలాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Pawan Kalyan: పిఠాపురంలో నాల్గో రోజు జనసేనాని పర్యటన..
కరీంనగర్ పరిధిలోని దిగువ మానేరు రిజర్వాయర్ నుంచి కాకతీయ కెనాల్‌కు నీటి విడుదలను ఆదివారం అధికారులు నిలిపివేశారు. ముందస్తు ప్రణాళిక, తాగునీటి కొరతతో కాకతీయ కాలువ ద్వారా యాసంగి సాగుకు నీటి విడుదల నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఎల్ ఎండీలో ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉందని, మిడ్ మానేరు నుంచి 1.20 టీఎంసీల నీరు మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు. తాగునీటి అవసరాలకు 6.20 టీఎంసీల నీరు అవసరమని, దానిని వృథా చేయకుండా వినియోగించుకుంటేనే నీటి ఎద్దడిని అధిగమించవచ్చని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోని నీటిని తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రాజెక్టులో అవసరమైన నీటిని నిల్వ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
Mumbai Indians Record: ముంబై ఇండియన్స్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి జట్టు!