Rash Driving: రోడ్డుపై యువకులు కోతివేశాలు.. ఎంట్రీ ఇచ్చిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Young people are driving rashly on the road: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బైక్ రైడర్స్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ఫ్లెక్సీలు, బోర్డింగ్ లు పెట్టి మరీ ప్రచారం చేసినా పట్టించుకోవడం లేదు. కంటి ముందు ప్రమాదాలు జరుగుతున్న పక్కనపెట్టి తమ ఆనందంకోసం బైక్ పై స్టంట్ లు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. బైక్ లో ఒక్కరు లేదా ఇద్దరు ఉంటేనే వారు హెల్మెట్ పాస్ బుక్‌లు, సిగ్నల్ క్రాస్, ర్యాష్ డ్రైవింగ్ ఇలా కేసులు బుక్ చేస్తున్న అవన్నీ బేఖాతరు చేస్తూ ఒకే బైక్ పై ముగ్గురు కూర్చొన్ని స్టంట్ చేస్తూ వారిపని వారుచేసుకుంటూ పోతున్నారు యువత. బైక్‌పై ముగ్గురు యువకులు కూర్చొని పబ్లిక్ ప్లేస్ లో కోతివేశాలు వేసుకుంటూ స్టంట్ లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Dhee 15: డాన్సింగ్ కింగ్ ఈజ్ బ్యాక్
Also Read
- Warangal: ఐనవోలులో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కుమార్తెలు అనుమానాస్పద మృతి..
- RTC Bus Stuck: వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
- Warangal: ప్రియుడితో కలిసి భర్త హత్యకు ఇల్లాలు కుట్ర.. బాధితుడు ఎలా బయటపడ్డాడంటే..!
- Warangal: భార్యను కొడుతుండగా అడ్డువెళ్లిన తండ్రి.. కట్ చేస్తే..?
వరంగల్ కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగట్టు నుండి భీమారం మెయిన్ రోడ్డు పైనా బైక్ పైన ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ముగ్గురు యువకులు కాకతీయ యూనివర్సిటీ పోలీసు అరెస్ట్ చేశారు. ముగ్గురు యువకులు మెయిన్ రోడ్డు పైనా TS24A1324 అను బండి మీద అతివేగంగా, అజాగ్రత్తగా నిర్లక్ష్యంతో వికృత విన్యాసాలు చేస్తూ ఇతర వాహన దారులకు ఇబ్బందులు కలిగిస్తూ డ్రైవింగ్ చేస్తున్న వీడియోను ఒకప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఈ వీడియో కాస్త వైరల్ అయ్యింది. దీంతో వరంగల్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆ వీడియోలో ఉన్నది ఎవరు అన్నది సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు సుర రమేష్, వల్లపు విలాకర్, వల్లపు నాగరాజుగా గుర్తించి kuc పోలీస్ వారు వారిని అరెస్టు చేశారు. ఇలాంటి ఘటనలో మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈఘటన వెలుగులోకి వచ్చిందని తెలిపారు. వరంగల్ యువతకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Drone Attack: దేశ అధ్యక్షుడిపై డ్రోన్ దాడికి పాల్పడిన ముగ్గురికి 30 ఏళ్ల జైలుశిక్ష
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!