Medico Preethi Incident: మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం.. నిందితుడిపై అట్రాసిటీ కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medico Preethi Incident: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఆత్మహత్యాయత్నం చేసిన మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నిమ్స్ వైద్యులు ప్రకటించారు.. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై తాజాగా బులెటిన్ విడుదల చేసిన నిమ్స్ వైద్యులు.. ప్రీతికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.. ప్రీతికి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరిగిందని, చికిత్సకు ఆమె శరీరం ఏమాత్రం సహకరించడం లేదని వైద్యులు చెబుతున్నారు.. బీపీ, పల్స్ రేటు నమోదు కాని పరిస్థితి ఏర్పడింది.. ప్రీతికి ఐదుగురు వైద్యుల బృందం చికిత్స అందిస్తోందని వెల్లడించారు.. ప్రీతి నిమ్స్ లో జాయిన్ అయ్యేటప్పటికి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉందంటున్నారు వైద్యులు.. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. ఎక్మో సపోర్ట్‌తో ట్రీట్మెంట్ చేస్తున్నామని.. కార్డియాక్, శ్వాస కోశ సమస్యలు ఉన్నాయని.. అన్ని డిపార్ట్మెంట్‌లు.. క్లోస్ మానటరింగ్ చేస్తున్నాయని బులెటిన్‌లో పేర్కొన్నారు నిమ్స్ వైద్యులు.
Read Also: Rajan Kohli resigns: విప్రోకి షాకిచ్చిన కోహ్లీ.. మూడు దశాబ్దాల తర్వాత రాజీనామా..
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
మరోవైపు.. కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు ర్యాగింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్‌పై క్రైమ్ నంబర్ 69/2023 u/s 306 r/w 108 , 354 of IPC, 4(v) of ragging act, 3(1)(r), 3 (2)(va),3 (1)(w)(ii) of sc st act నమోదు చేశామని వరంగల్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు.. బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి.. ఈ కేసు నమోదు చేశామని తదుపరి విచారణ అనంతరం శాఖ పరమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా వివరించారు.. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షార్హులే నని దోషులు ఎప్పటికైనా తప్పించు కోలేరని స్పష్టం చేశారు.. అయితే, సంస్థాగతంగా పూర్తి స్థాయిలో విచారణ లేకుండా సామాజిక మధ్యమాల్లో వస్తున్న సమాచారం సరైనది కాదని.. అందరూ సంయవనం పాటించాలని సూచించారు అసిస్టెంట్ కమిషనర్ బోనాల కిషన్.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!