Pregnancy Diet: బిడ్డ ఎదుగుదల కోసం గర్భిణీలు ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి మహిళకు తల్లీ అయ్యే సమయం చాలా కీలకమైనది.. ఆ సమయంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి..గర్భధారణ సమయంలో జింక్ వంటి ఇతర పోషకాల లోపం తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.. అందుకే పోషకాహార నిపుణులు గర్భిణీ మహిళలకు ప్రత్యేక డైట్‌ను సూచిస్తారు. అందుకే గర్భిణీ మహిళకు, కడుపులోని బిడ్డకు ఇద్దరి ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు అందేలా తగిన ఆహార నియమాలు పాటించాలని చెబుతుంటారు. ఆరోగ్యకరమైన గర్భధారణకు జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. జింక్ అనేది ఆరోగ్యానికి మేలు చేసే ముఖ్యమైన ఖనిజం. శరీరంలోని పలు ముఖ్యమైన క్రియల్లో జింగ్ కీలకంగా వ్యవహరిస్తుంది. అయితే,మన శరీరం జింక్‌ను నిల్వ చేయలేదు. అందువల్ల రోజు వారీ ఆహారంలో తగినంత మొత్తంలో జింక్ అందాలంటే పోషకవిలువలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఏయే ఆహారాల్లో జింక్ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
*. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి.. ముఖ్యంగా బాదంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయం పూట ఆహారంలో నానబెట్టిన బాదంపప్పును చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది..
*. జీడిపప్పులో ఫైబర్, ప్రోటీన్, మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా జీడిపప్పులో జింక్, మెగ్నీషియం, ఇనుము, భాస్వరం వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి.
*. ఉసిరికాయ.. ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, జింక్ ఉంటాయి. ఉసిరికాయతో తయారు చేసిన రకరకాల ఆహారాలను తయారు చేసి మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
*. మొక్కల ఆధారిత కాయధాన్యాల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. జింక్ పుష్కలంగా ఉండే కాయధాన్యాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం..
*. పొద్దుతిరుగుడు విత్తనాల్లో చాలా ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ విత్తనాలను తింటే గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది..
*. శాకాహారులకు పనీర్ మంచి ప్రొటీన్ మూలం. మీ ఆహారంలో పనీర్‌ను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు..
*. నువ్వులు..క్యాల్షియం, ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాల్లో నువ్వులు ముఖ్యమైనది. సలాడ్లు, రొట్టెలు, మఫిన్లు వంటి వివిధ వంటకాలకు నువ్వులను జోడించి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.. వీటిలో ఏదోకటి డైట్ లో చేర్చుకోవడం మంచిది..
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!