Warangal Chapata Chilli: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రమే పండిస్తున్న చపాట మిర్చి అరుదైన ఖ్యాతిని సాధించింది. ఎర్రటి రంగుతోపాటు తక్కువ మోతాదులో కారం ఉండే ఈ రకం మిరప.. తాజాగా జీఐ (జియోగ్రాఫిక్ ఇండికేషన్) ట్యాగ్‌ను సాధించింది. చపాట మిరపకు జీఐ ట్యాగ్ కోసం తిమ్మంపేట మిర్చి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ రెండేళ్ల క్రితం దరఖాస్తు చేయగా.. ఇండియన్ పేటెంట్ ఆఫీ స్(ఐపీవో) తాజాగా ఆమోదించింది.
Read also: Maharaja : చైనా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న మహారాజా
‘జియోగ్రాఫిక్ ఇండికేషన్స్ జర్నల్’లోనూ చపాట రకం మిర్చికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. చపాట రకం మిరపకాయలు టమోటా మాదిరిగా ఉంటాయి. అందుకే దీన్ని టమోటా మిరప అని కూడా పిలుస్తారు. రెండేళ్ల క్రితం చపాట మిర్చికి వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.లక్ష వరకు ధర పలికింది. తాజాగా జీఐ ట్యాగ్‌తో ఈ రకం మిర్చి ప్రత్యేక గుర్తింపు సాధించినట్లయింది.
Read also: CM Revanth Reddy: నేడు నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
వరంగల్ మిరపకాయ అని కూడా పిలువబడే చపాటా మిరపకాయకు ప్రత్యేకమైన రంగు ఉంటుంది. మెక్సికన్ క్యాప్సికమ్‌ను పోలి ఉండే ఈ మిరపకాయను వరంగల్‌లోనే పండిస్తారు. ఈ మిరపకాయ ఎరుపు రంగులో ఎక్కువ, కారంగా తక్కువగా ఉంటుందని ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారులు, మిరప రైతులు తెలిపారు. స్కోవిల్లే స్కేలుపై ఈ మిరపకాయ ఘాటు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మిరపకాయను ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, రెస్టారెంట్లు, పానీయాలు, ఊరగాయల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం క్వింటాల్ వేల్లలో పలుకుతుంది.
Read also: Syria: సిరియాలో మారణహోమం!.. అక్కడి నుంచి వచ్చేయాలని భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
ముఖ్యంగా తూర్పు ఆసియాలో అంతర్జాతీయంగా ఈ మిరపకాయకు విపరీతమైన డిమాండ్ ఉందని ఉద్యాన విశ్వవిద్యాలయం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయని, చపాటా మిరపకాయను ఎక్కువగా రెస్టారెంట్లతో పాటు పచ్చళ్ల తయారీలో వినియోగిస్తామన్నారు. ఈ మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించడంతో తెలంగాణ నుంచి జీఐ ట్యాగ్ సాధించిన 18వ ఉత్పత్తిగా చపాట వరంగల్ మిర్చి నిలిచింది.
CM Chandrababu : నేడు బాపట్లలో సీఎం చంద్రబాబు పర్యటన…