Site icon NTV Telugu

Vikarabad: స్కూల్‌ ఎప్పుడు కూలుతుందో తెలియని భయం.. పీర్ల కొట్టం, గణేష్‌ మండపంలో పాఠాలు..!

Vikarabad

Vikarabad

Vikarabad: తమ ప్రభుత్వాలు విద్యకు ప్రాముఖ్యత ఇస్తున్నాయి.. అందరికీ చదువు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెబుతున్నా.. కింది స్థాయిలో కొన్ని చోట్ల.. ఆ పాఠశాలలో అడుగు పెట్టాలంటేనే వణికిపోయే పరిస్థితి.. వర్షం కాలం కాకుండా.. మిగతా రోజుల్లో ఏ చెట్టుకిందనో.. వరండాలో.. విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లు ఉన్నారు.. కానీ, వర్షాకాలం వచ్చిందంటే చాలు.. పాత భవనాలు ఎప్పుడూ కూలిపోతాయే తెలియని పరిస్థితి.. ఇప్పటికే పెచ్చులూడిన ఆ భవనాల్లో.. వర్షా కాలంలో నీళ్లు కూడా కారుతుండడంతో.. ఆ స్కూల్‌లో అడుగుపెట్టలేక.. విద్యార్థులను పాఠాలకు దూరం చేయడం ఇష్టం లేక.. పీర్ల కొట్టంను.. గణేష్ మండపాలను స్కూల్‌గా మార్చుకొని పాఠాలు చెబుతున్నారు ఉపాధ్యాయులు.

Read Also: Medaram 2026: మేడారం జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ నిధుల మంజూరు

వికారాబాద్‌లోని స్కూళ్ల దుస్థితిని పరిశీలిస్తే.. వర్షం దాటికి రెండు వేర్వేరు గ్రామాలలోని పాఠశాలల్లో ఆ భవనాలకు సంబంధించి పెచ్చులు ఓవైపు, వర్షపునీరు మరోవైపు.. కిందపడుతోంది.. పెచ్చులు ఊడుతుండడంతో ఆ భవనం ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి.. భయంతో స్కూల్‌కు రావాలంటేనే విద్యార్థులు వణికిపోతుంటూ.. ఒక గ్రామానికి చెందిన పాఠశాల పిల్లలను పీర్ల కొట్టానికి (ముస్లింలు పీర్లను పెట్టే ప్రదేశం) సంబంధించిన రేకుల షెడ్డులో పాటలు చెబుతుంటే.. మరో గ్రామంలో గణేష్ మండపంలో పాటలు చెబుతున్నాడు ఉపాధ్యాయులు… పాఠశాల భవనాలలో కురుస్తున్న వర్షం, నీటి చుక్కలతో తరగతి గది మడుగుగా మారగా.. పై నుంచి కారుతున్న నీరు ఫ్యాన్లలోకి, ట్యూబ్లైట్లలోకి చేరింది.. తమకు, తమతోపాటు విద్యార్థులకు ఎక్కడ షాక్ కొడుతుందో తెలియని భయం ఓవైపు.. భవనాలు కూడా ఎప్పుడూ నేలకూలతాయోమోనన్న భయంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అంటున్నారు టీచర్లు..

Read Also: Medaram 2026: మేడారం జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ నిధుల మంజూరు

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలో గత 30 ఏళ్ల క్రితం నిర్మించిన స్కూల్ భవనం, అదే మండలానికి చెందిన మేడికొండ గ్రామంలో 30 సంవత్సరాల కిందట నిర్మించిన బిల్డింగ్‌లు ఉన్నాయి.. ఈ స్కూల్ భవనాలు వర్షం సమయంలో కురుస్తున్నాయి ‌… రాకంచెర్ల ప్రైమరీ స్కూల్ భవనంలో భారీ వర్షాలకు స్కూల్ భవనం స్లాబ్‌ పూర్తిగా నానిపోయి.. నీటి చుక్కలు క్లాస్‌ రూమ్‌లో కారుతూ తడిగా మారిపోయింది. స్కూల్‌లోని ఫ్యాన్లలోకి సైతం ఆ నీరు చేరింది.. ఎక్కడ షాక్ కొడుతుందో, స్కూల్ భవనం ఎక్కడ కూలుతుందో తెలియని పరిస్థితిలో స్కూల్ పక్కనే ఉన్న పీర్ల కొట్టంలో రేకుల షెడ్డు కింద విద్యార్థులకు విద్యాబోధనలో చేస్తున్నారు.. ఇదిలా ఉంటే అదే మండలానికి చెందిన మరో గ్రామం మేడికొండలోని ప్రైమరీ స్కూల్‌లో కూడా అదే దుస్థితి. ఈ స్కూల్‌ కూడా వర్షానికి నాని పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే స్కూల్ భవనం చెట్టు పైన కవర్ కప్పండి నీళ్లు కురవకుండా ఉంటాయని సలహా ఇచ్చినట్లు సమాచారం. ఆ భవనం ఎప్పుడు కూలుతుందో కూడా తెలియని భయంతో పక్కనే ఉన్న గణేష్ మండపంలో విద్యార్థులను కూర్చొబెట్టి పాఠాలు చెబుతున్నారు..

Read Also: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇప్పుడు మిడ్ సెగ్మెంట్లో.. భారీ డిస్కౌంట్తో Realme P4 Pro 5G లాంచ్!

అయితే, ఆ గ్రామంలో నూతన స్కూల్ భవనం కట్టి సగానికి వదిలేశాడు కాంట్రాక్టర్. బిల్డింగ్ కట్టిన బిల్లు రావడంలేదని స్కూల్ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గతంలో ఇదే పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు విద్యుత్ షాక్ గురై చనిపోయిన ఘటన అందరినీ భయంతో వణికిపోయేలాచేస్తోంది.. ఉపాధ్యాయులు గత రెండు సంవత్సరాల నుంచి జిల్లా కలెక్టర్‌, విద్యాశాఖ అధికారికి, మండల అధికారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి మండలాలలో శిథిలావస్థలో ఉన్న స్కూల్‌ భవనాలను తొలగించి కొత్త భవనాలను నిర్మించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు..

Exit mobile version