ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.. గణేష్ మండపం పక్కన చికెన్ భోజనాలు ఏర్పాటు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో 30 మందిపై కేసు నమోదు చేశారు నందిగామ పోలీసులు.
వర్షం దాటికి రెండు వేర్వేరు గ్రామాలలోని పాఠశాలల్లో ఆ భవనాలకు సంబంధించి పెచ్చులు ఓవైపు, వర్షపునీరు మరోవైపు.. కిందపడుతోంది.. పెచ్చులు ఊడుతుండడంతో ఆ భవనం ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి.. భయంతో స్కూల్‌కు రావాలంటేనే విద్యార్థులు వణికిపోతుంటూ.. ఒక గ్రామానికి చెందిన పాఠశాల పిల్లలను పీర్ల కొట్టానికి (ముస్లింలు పీర్లను పెట్టే ప్రదేశం) సంబంధించిన రేకుల షెడ్డులో పాటలు చెబుతుంటే.. మరో గ్రామంలో గణేష్ మండపంలో పాటలు చెబుతున్నాడు ఉపాధ్యాయులు.
తిరుపతిలో వినాయక చవితి ఉత్సవాలలో రికార్డింగ్ డాన్స్, అశ్లీల నృత్య ప్రదర్శనలు చేశారు.. అయితే, దీనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. అంతేకాదు.. 7 మంది నిర్వాహకులను అరెస్టు చేశారు అలిపిరి పోలీసులు..
Kottu Satyanarayana: ఏపీలో గణేష్ మండపాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. ఫైర్ సేఫ్టీ కోసం రూ.500, మైక్ పర్మిషన్ కోసం రోజుకు రూ.100 చలానా రూపంలో కట్టాలని.. ఈ నిబంధనలు ఎప్పటి నుంచో ఉన్నాయని.. కొత్తగా పెట్టిన నిబంధనలు కాదని స్పష్టం చేశారు. కేవలం నగరాలు, పట్టణాలకు మాత్రమే గణేష్ మండపాల ఏర్పాటుకు ఈ నిబంధనలు వర్తిస్తాయని.. గ్రామాల్లో ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదని తెలిపారు. దేవుడితో చెలగాటం…