రావణ రాజ్యం పోవాలి.. రాముడి రాజ్యం రావాలి-రాములమ్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రావణ రాజ్యం పోవాలి.. రాముడి రాజ్యం రావాలి అంటూ పిలుపునిచ్చారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో రోడ్ షోలో పాల్గొన్న ఆమె.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరపున ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ ప్రచారం కంటే.. ప్రజల బీజేపీ ప్రచారం ఎక్కువగా ఉందన్నారు.. ప్రజలు బీజేపీ పార్టీ ప్రచారాన్ని భుజాన వేసుకున్నారన్న రాములమ్మ.. ఈటల రాజేందర్ ఆరు సార్లు గెలిచాడంటే ప్రజల మద్దతు ఎలా ఉందో అర్ధమవుతుందన్నారు..
సీఎం కేసీఆర్ చేస్తున్న తప్పులకు ఈ రోజు హుజురాబాద్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు విజయశాంతి.. తెలంగాణ ఉద్యమ కారులను అవహేళన చేశాడు, తడిగుడ్డతో గొంతుకోశాడు అని ఆరోపించిన ఆమె.. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మోసం అక్కడి నుండే మొదలైందన్నారు. ప్రపంచాన్ని కుదిపేసిన కరోన కాలంలో ఈటెల రాజేందర్ తన డ్యూటీ తను చేశాడని.. కానీ, కరోన కాలంలో ప్రాణ తీపితో బయటకు రాని ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏడేళ్లు గా మంత్రి పదవిలో ఉన్న ఈటెలను ఏడూ నిమిషాల్లో తీసేశాడని మండిపడ్డారు.. తెలంగాణ ద్రోహులను దగ్గర పెట్టుకున్నావు, ఉద్యమ కారులను నడిరోడ్డు పై వదలేశావు కేసీఆర్ అంటూ ఫైర్ అయిన ఆమె.. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉద్యమకారులకు తోడుగా ఉండేది బీజేపీ పార్టీ.. నిన్ను గద్దె దింపే వరకు పోరాడుతుందన్నారు.. ఇక, దళితబంధు అనేది ఒక మాయ.. ప్రజలకు మేలు చేయడం కాదు, మోసం చేయడమే కేసీఆర్ పని అన్నారు విజయశాంతి.
Also Read
తాజావార్తలు
-
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ ముగిసేనా?
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
-
Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
-
Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?