ఇక ఆర్టీసీ బస్సులపై ఆ పోస్టర్లు కనిపించవు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మూడేళ్లకు పైగా సైబరాబాద్ సీపీగా సేవలు అందించిన సజ్జనార్ పేరు సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌లో పేరు మారుమోగింది. అనంతరం కూడా పోలీస్ వ్యవస్థలో ఆయన తన మార్క్ ను చూపించారు. అయితే ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా ఆయన తన మార్క్ ను చూపిస్తున్నారు. ఆరేళ్ళ చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు పరారీలో ఉండగా… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఎస్‌ఆర్టీసీ బస్ స్టాండ్స్ లో అలాగే బస్సులో నిందితుడు రాజు ఫోటోను ఉంచాలని సూచించారు. ఇక తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక పై టీఎస్‌ఆర్టీసీ బస్సుల పైన అభ్యంతరకర మరియు ఆశ్లీల ప్రకటనలు ఉండబోవని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు… అలాంటి పోస్టర్లను ఇంకా పై బస్సులపై అంటించకూడదని… ఇప్పటికే అంటించినవాటిని తొలిగించాలని టీఎస్‌ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్.
Also Read
తాజావార్తలు
-
Modi-Putin: “కార్ డిప్లమసీ”.. ఒకే కారులో మోడీ-పుతిన్..
-
ED raids : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్‌పై సోదాలు..?
-
Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
-
Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్‌లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?