సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మూడేళ్లకు పైగా సైబరాబాద్ సీపీగా సేవలు అందించిన సజ్జనార్ పేరు సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌లో పేరు మారుమోగింది. అనంతరం కూడా పోలీస్ వ్యవస్థలో ఆయన తన మార్క్ ను చూపించారు. అయితే ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా ఆయన తన మార్క్…