Vaishali Kidnap Case: వైశాలి కిడ్నాప్ కేస్.. నవీన్ రెడ్డితో సహా 14మందికి రిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaishali Kidnap Case: భాగ్యనగరంలో సంచలనం రేకెత్తించిన దంత వైద్య విద్యార్థిని అపహరణ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి సహా ఆరుగురు నిందితులకు ఇబ్రమీంపట్నం కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే నవీన్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే సమయంలో 58 నిమిషాల వీడియో విడుదల చేస్తే.. అందులో రెండు నిమిషాలే పోలీసులు మీడియాకు విడుదల చేశారని నవీన్ రెడ్డి ఆరోపించాడు. భయం వేస్తోందంటూ కన్నీరు పెట్టుకున్నాడు. గతంలో నవీన్ రెడ్డిపై వరంగల్, విశాఖపట్నం, ఆదిభట్లలో నమోదైన వాటితో కలిపి 4 కేసులు ఉన్నట్లు
తెలిపిన పోలీసులు ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని విచారించేందుకు కోర్టులో నేడు పిటిషన్ దాఖలు చేయనున్నారు. అయితే.. పరారీలో ఉన్న రుమన్, పవన్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు పోలీసులు వివరించారు.
Read also: S Jaishankar: ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన మీరా మాట్లాడేది..? పాక్ తీరుపై నిప్పులు
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ఈనేపథ్యంలో మంగళవారం సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల ద్వారా మీడియాకు చేరవేశాడు నవీన్ రెడ్డి. తనే, బాధితుడినంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఈవీడియో సంచలనంగా మారింది. ఇక, 6 రోజులుగా ఇతడి ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా గోవాలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడకు వెళ్లి నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దవున్న ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, రాత్రి ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపరిచారు.
అసలు ఏం జరిగింది
తాను ఇష్టపడిన హైదరాబాద్ మన్నెగూడకు చెందిన దంత వైద్యురాలు వైశాలిని తను దక్కించుకోవాలని అనుకున్నాడు. వైశాలికి ఎన్ఆర్ఐ సంబంధం రావాడంతో ఈ నెల 9న తల్లిదండ్రులు నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో విషయం తెలుసుకున్న ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి యువతిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు. దీనికి పక్కప్లాన్ వేసిన నవీన్ రెడ్డి తన అనుచరులతో పాటు తన ప్రాంఛైజీ స్టాళ్లలో పని చేసే 50 మందిని అమ్మాయి ఇంటికి తీసుకొచ్చి దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను బలవంతంగా అపహరించి తీసుకెళ్లాడు. వైశాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈసమాచారం నవీన్ రెడ్డికి తెలియడంతో.. మిత్రుల సహకారంతో యువతిని సురక్షితంగా కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో..మరుసటి రోజు 32 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే..ఈ నెల 11న శంషాబాద్ పరిసరాల్లో నిందితుడి వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, చందు, ప్రవీణ్, ప్రకాష్, మహేశ్, యశ్వంత్‌ను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 5 సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని జప్తు చేశారు.
Astrology: డిసెంబర్ 15, గురువారం దినఫలాలు
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!