నన్ను పార్టీలో నుంచి బయటకు పంపపాలని కుట్ర చేస్తున్నారు: వీహెచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అధికార పక్షంతో పోరాడటం పక్కన ఉంచితే స్వపక్షంలో విపక్షాలు తయారవుతున్నాయి. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇటీవల తనకు అవమానం జరిగిందని.. తనను అవమానపరిచిన మంచిర్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావుకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని పట్టుబట్టాడు. ప్రస్తుతం ఈ షోకాజ్ నోటిసే కాంగ్రెస్ పార్టీలో రచ్చకు కారణం అవుతోంది. ప్రేమ్ సాగర్ రావుకు ఇచ్చిన షోకాజ్ నోటీసులో ఏమీ లేదంటూ.. వీహెచ్ విమర్శిస్తున్నారు. మంచిర్యాలలో మాకు అవమానం జరిగితే పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటూ మండిపడ్డారు.
Read Also: కేంద్రంలో బీజేపీ తెలంగాణ పాలిట శ్రతువు: వేముల ప్రశాంత్ రెడ్డి
Also Read
పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం వెంటనే నిర్వహించాలని వీహెచ్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రేమ్ సాగర్ రావుపై పార్టీ వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల కోసం వెళ్తే అవమానించారని విమర్శించారు. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. గతంలో జగ్గారెడ్డి సైతం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ .. అన్ని తనకు చెప్పి చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దీంతో కాంగ్రెస్‌లో నిత్యం ఏదో మూలన అసంతృప్తి జ్వాలలు రగులుతునే ఉన్నాయి. పైకి పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని చెప్పిన అప్పుడప్పుడు ఈ విబేధాలు ఒక్కసారిగా గుప్పుమంటున్నాయి.
తాజావార్తలు
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!