Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చేపట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమంలో బస్సు ప్రమాదం సంచలనంగా మారింది. ఎమ్మెల్యేలు వెళుతున్న బస్సు టైరు పగలడంతో బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. డ్రైవర్ చాకచక్యంతో బస్సును పక్కకు ఆపడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే బస్సు ఘటనపై నీటిపారుదల, పౌరసరఫరాలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తున్న బస్సు టైర్ పగిలిందని చూశా అన్నారు. ఇక కారు టైర్లు అన్నీ మిగిలిపోయాయని సెటైర్ వేశారు. కారు ఇక షెడ్డుకు పోవాల్సిందే అని అన్నారు.
ఎన్టీఎస్ఏ నిపుణుల కమిటీ వేయాలని మేము కోరామన్నారు. కమిటీ వేయడం స్వాగతిస్తున్నామన్నారు. యుద్ధ ప్రాతిపదికన మూడు బ్యారేజీ లు సందర్శించి త్వరగా నివేదిక ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం.. స్టర్క్చర్ లేదు కాబట్టి ఇవ్వలేదని తెలిపారు. గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇవ్వలేదని అన్నారు. క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలేదన్నారు. ఇప్పుడు చేసినవి పంపినాము అని, గత ప్రభుత్వ పని తీరు అలా ఉంది మరి మేము ఏం చేయాలని చురకలంటించారు. థర్డ్ పార్టీ రిపోర్ట్ లేనే లేదన్నారు. కంప్లైషన్ రిపోర్ట్ ఒకటి కాదు..రెండు మూడు రిపోర్ట్ లు ఇచ్చాయన్నారు. దీనిపై విజిలెన్స్ నివేదిక ఇచ్చిందన్నారు. లీగల్ ఒపీనియన్ తీసుకుని చట్టప్రకారం కేసులు పెడతామన్నారు.
Read also: BRS Chalo Medigadda: బీఆర్ఎస్ నేతలకు తప్పిన ప్రమాదం.. పేలిన బస్సు టైర్
ఎన్డీఎస్ఏకి పూర్తిగా సహకరిస్తామన్నారు. ఎన్డీఎస్ఏని విచారణ చేయండని కోరిందే మేము అని గుర్తుచేశారు. మేడిగడ్డ దగ్గర కి బ్యారేజి తరలించేందుకి తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత తక్కువ అని కేసీఆర్ చెప్పారని అన్నారు. CWC చెప్పిందని కేసీఆర్ అబద్ధం చెప్పారని కేంద్రం చెప్తుందన్నారు. CWC ఎప్పుడు అలా చెప్పలేదని వెదిర శ్రీరామ్ స్పష్టం చేశారన్నారు. CWc అనుమతి ఇవ్వలేదు.. ఇన్వెస్ట్మెంట్ అనుమతి ఇవ్వలేదని కేంద్ర అధికారులు అంటున్నారని తెలిపారు. ఏం అనుమతి ఇవ్వనిది కేంద్ర ప్రభుత్వ సంస్థలు లక్ష కోట్ల అప్పులు ఎలా ఇచ్చాయి? అని ప్రశ్నించారు. కేంద్రం కూడా తప్పు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా.. మేము చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ విధ్వంసం చేసిందన్నారు. కేటీఆర్ కంటే..ఎన్డీఎస్ఏ కి ఎక్కువ నాలెడ్జి ఉందని, అందుకే ఎన్డీఎస్ఏ నివేదిక కోరామన్నారు. కేటీఆర్ కి ఎక్కువ అనుభవం ఉందా.. ఎన్డీఎస్ఏ వాళ్లకు ఎక్కువ నాలెడ్జి ఉందా? అని ప్రశ్నించారు. చేసిన దొంగతనం గురించి చెప్పకుండా.. ఎదుటివారిని దొంగ అంటున్నారు కేటీఆర్ అని మండిపడ్డారు.
MLA Lasyana Nditha: లాస్య నందిత కేసులో ట్విస్ట్.. టిప్పర్ లారీ డ్రైవర్ అరెస్ట్
