హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకవీడు మండలం ముసి ఒడ్డు సింగారం లో 7 కోట్ల 29 లక్షల 50 వేల అంచనాతో నిర్మిస్తున్న చెక్ డ్యాం నిర్మాణంలో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు మండల ఎంపీపీ విజ్ఞప్తి మేరా నిర్మాణా పనులను పరిశీలించిన టిపిసిసి అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… చెక్ డ్యామ్ నిర్మాణం రైతుల కోసమా లేక కాంట్రాక్టర్. కొంతమంది పెద్దమనుషుల కమీషన్ల కోసమా అని అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో గత రెండేళ్ల నుండి అవినీతి తాండవిస్తుంది. గలీజ్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా హుజూర్ నగర్ ఉందని… హుజూర్ నగర్ నియోజకవర్గంలో చరిత్ర కలిగిన కమ్యూనిస్టు దిగ్గజాలు హేమాహేమీలు ఎమ్మెల్యేలు గా పని చేశారు. కానీ రెండు ఏళ్ళుగా గలీజ్ రాజకీయాలు చేస్తున్నారు. చెక్ డ్యామ్ నిర్మాణం 200 మీటర్లు పైకి మార్చి నిర్మాణం చేస్తున్నారు. ఈ చెక్ డాం మిర్యాలగూడ భాస్కర్ రావుకి అనుకూలంగా ఉందని స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు అని అన్నారు.
ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న కాంట్రాక్టర్ కి చెక్ డేమ్ నిర్మాణం పనులు ఎలా ఇచ్చారు. గ్రామస్తులు వ్యతిరేకిస్తున్న నిర్మాణ పనులు రాత్రికి రాత్రే ఎలా చేస్తారు. కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ నిధులు వీరికి అనుకూలంగా ఎలా మార్చుకుంటారు. అధికార పార్టీ సర్పంచ్ వార్డ్ నెంబర్లు గ్రామస్థుల తీర్మానం చేసిన పనులు ఎందుకు నిలుపుదల చేయడం లేదు. కాంట్రాక్టర్ భూముల కోసం మే నిర్మాణం మార్చి నిర్మిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే ల చెక్ డ్యామ్ నిర్మాణం జరగాలి…. కాంట్రాక్టర్ కోసం కాదు అని తెలిపారు. గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం చెక్ డ్యామ్ నిర్మాణం తక్షణమే నిలిపివేయాలి. గ్రామస్తులు రైతులు కొరకు ఎంత దూరమైనా వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అని పేర్కొన్నారు.