తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్ తరువాత మొదటి సారిగా గాంధీభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ టూర్‌తో క్యాడర్లో జోష్ వచ్చిందన్నారు. అంతేకాకుండా డిక్లరేషన్ పై…కేటీఆర్ ఎన్నో మాట్లాడారని, కేటీఆర్.. ఓ సారి ఛత్తీస్ ఘడ్ వెళ్ళు .. అక్కడ రైతుల రుణమాఫీ… ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతుందో తెలుసుకో అని ఆయన వ్యాఖ్యానించారు. అడ్డగోలుగా మాట్లాడిన.. బీజేపీ.. టీఆర్ఎస్.. ఎంఐఎం చీకటి కోణం బయట పడిందన్నారు.
ఎంఐఎం నీ మాట కూడా అనని రాహుల్ పై ఎంఐఎం ఎందుకు స్పందించిందని ఆయన ప్రశ్నించారు. ఎవరి కోసం స్పందించారు అనేది సమాధానం చెప్పాలని, దాసుకో.. దోచుకో అనేదే టీఆర్ఎస్ విధానమన్నారు. 2004 నుండి..2014 వరకు రాహుల్ కోరుకుంటే ప్రధాని అయ్యే వాడని, కేటీఆర్ మాటలు చూస్తూ.. ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. రాహుల్ కాబోయే ప్రధాని.. కాబోయే ఏఐసీసీ అధ్యక్షుడు అని ఆయన ఉత్తమ్ స్పష్టం చేశారు.