Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Uttam Kumar Reddy Clarifies Lpg Gas Supply Telangana

Uttam Kumar Reddy: గ్యాస్‌పై తెలంగాణ ప్రజలకు ఊరట.. మంత్రి కీలక ప్రకటన..

Published Date :March 14, 2026 , 7:15 pm
By Gogikar Sai Krishna
  • గ్యాస్ కొరతపై మంత్రి స్పష్టత
  • గృహ వినియోగదారులకు సరిపడా సిలిండర్లు
  • కమర్షియల్ గ్యాస్ కొరతకు కేంద్ర గైడ్‌లైన్స్ కారణం
  • అక్రమ నిల్వలపై ప్రత్యేక కమిటీల ఏర్పాటు
Uttam Kumar Reddy: గ్యాస్‌పై తెలంగాణ ప్రజలకు ఊరట.. మంత్రి కీలక ప్రకటన..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, కేవలం కమర్షియల్ సిలిండర్ల విషయంలోనే కొంత కొరత ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ , ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా 1.3 కోట్ల మంది యాక్టివ్ గృహ వినియోగదారులు ఉన్నారని, వారికి సరిపడా సిలిండర్లను ఆయిల్ కంపెనీలు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. గతంలో రోజుకు సగటున 2.15 లక్షల సిలిండర్లు సరఫరా అయ్యేవని, ప్రస్తుత డిమాండ్‌ను బట్టి దానిని 2.3 లక్షలకు పెంచినట్లు ఆయన వెల్లడించారు. గ్యాస్ కొరత ఉందన్న ఆందోళనతో వినియోగదారులు అనవసరంగా ఓవర్ బుకింగ్ చేసి సిస్టమ్‌ను ఓవర్‌లోడ్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Cockroach: బాబోయ్ ఇవి బొద్దింకలు కావు.. కొత్త తరం గూఢాచారులు!

హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలు వాడే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో మాత్రం తగ్గుదల ఉన్న మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొత్త మార్గదర్శకాల వల్ల గతంలో ఉన్న సరఫరాలో కేవలం 20 శాతం మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉందని ఆయన వివరించారు. గతంలో రోజుకు 23,000 కమర్షియల్ సిలిండర్లు సరఫరా అయ్యే చోట, ఇప్పుడు కేవలం 6,200 మాత్రమే వస్తున్నాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని ఆయన హామీ ఇచ్చారు.

Father Property: తండ్రి ఆస్తులు అన్నీ కొడుకువి కావు.. సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు..

రాష్ట్రంలో గ్యాస్ పంపిణీ సక్రమంగా జరిగేలా చూడటంతో పాటు, అక్రమ నిల్వలను అరికట్టేందుకు రాష్ట్ర , జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. గృహ అవసరాల సిలిండర్లు పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మొత్తానికి, సామాన్యుడి వంటింట్లో మంట ఆరిపోకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని ఆయన భరోసా ఇచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Civil Supplies
  • Gas Cylinder Shortage
  • LPG Gas Supply
  • telangana news
  • uttam kumar reddy

తాజావార్తలు

  • Uttam Kumar Reddy: గ్యాస్‌పై తెలంగాణ ప్రజలకు ఊరట.. మంత్రి కీలక ప్రకటన..

  • Ustaad Bhagat Singh Trailer: ఇచ్చిపడేసే గోత్రం .. ఇరగదీసే నక్షత్రం.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్‌ వచ్చేసింది

  • Twin Sister: తోడబుట్టిన చెల్లి అని కూడా చూడలేదు.. 40 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు..

  • Durandhar 2: ధురంధర్ ది రివెంజ్ అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభం

  • Durandhar 2 : మరీ ఇంత ధైర్యమా ఆదిత్య ధర్?

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions