Uttam Kumar Reddy: 50 వేల మెజార్టీతో గెలుస్తా.. ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy: హుజూర్నగర్ నియోజవర్గంలో నేను 50 వేల మెజార్టీతో గెలుస్తా.. ఒక్క ఓటు తక్కువైనా రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. హుజూర్నగర్ అసెంబ్లీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆయన.. సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ ఎంపీ స్థానానికి పోటీ చేశారు.. దాంతో, హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో.. ఆయన భార్యను బరిలోకి దింపినా.. విజయం సాధించలేకపోయారు.. అయితే, వచ్చే ఎన్నికల్లో మరోసారి హుజూర్నగర్ నుంచి పోటీచేసే యోచనలో ఉత్తమ్ ఉన్నట్టుగా తెలుస్తోంది.. మంత్రి కేటీఆర్ హుజూర్నగర్ పర్యటన నేపథ్యంలో.. ఉత్తమ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి కుమారుడి అరెస్ట్..
- NEET Re Exam : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Rythu Bharosa: రైతులకు తీపి కబురు.. రైతు భరోసా డబ్బులు పడేది ఆరోజే..
- Road Accidents: తెలంగాణలో ఒకే రోజు మూడు ఘోర ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం..
హుజూర్‌నగర్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. నా హయాంలో 80 శాతం పూర్తయిన పనులను.. 8 సంవత్సరాల పాటు సాగదీసి ఇప్పుడు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారంటూ ఫైర్ అయ్యారు.. డబుల్ బెడ్ రూమ్‌లను వేగంగా పూర్తి చేసి నిజమైన లబ్ధిదారులకు వాటిని కేటాయించాలని డిమాండ్ చేశారు.. మున్సిపల్ భూములకు సంబంధించిన భూముల రికార్డులు మున్సిపాలిటీలో మాయం అవుతున్నాయని కేటీఆర్‌కు ఫిర్యాదు చేశా.. దీనిపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.. మున్సిపల్ కమిషనర్ కంప్యూటర్ లాగిన్ చోరి చేసి ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్ కేటాయించిన విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లానని.. భూకబ్జాదారులను కాపాడటానికి మాత్రమే ఆర్డీవో కార్యాలయం ఉపయోగపడుతుందని ఆరోపించారు. నా హయాంలో కట్టించిన ఇరిగేషన్ లిఫ్ట్‌ల మరమ్మతులు కూడా చేయలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. కాగా, రానున్న ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి పోటీచేసేందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సిద్ధం అవుతున్నట్టు ఈ వ్యాఖ్యలతో స్పష్టం అవుతోంది.
తాజావార్తలు
-
Jamun-El Niño: విరగకాసిన ‘‘నేరేడు పండ్లు’’, ఈ ఏడాది వర్షాలు అనుమానమే.. అసలేంటీ ఈ సంబంధం..
-
Empty Medicine Packets Reuse: ఖాళీ టాబ్లెట్ స్ట్రిప్స్‌తో ఎన్నో లాభాలు.. ఈ విషయం తెలిస్తే పొరపాటున కూడా చెత్తబుట్టలో వేయరు..
-
Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో ఇజ్రాయెల్‌కు నష్టమే.. రాయబారి రూవెన్ అజార్ కీలక వ్యాఖ్యలు
-
Sajjad Nomani: హిందువులు దేశంలో మెజారిటీ కాదు.. మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Mahendragiri Varahi: మైండ్ బ్లాక్ చేస్తున్న సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’!
ట్రెండింగ్
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!