Rahul Gandhi: పండుగల సమయం.. ర్యాలీ వాయిదా వేయండి.. రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
- నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ మెగా ర్యాలీ
- ర్యాలీ వాయిదా వేయండి
- రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఓటును కాపాడండి.. దేశాన్ని కాపాడండి’ అంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో నవంబర్ 1న మెగా ర్యాలీ చేపట్టింది. అయితే ఈ ర్యాలీపై వ్యాపారవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి వంటి పెద్ద పండుగలు ఉన్న నేపథ్యంలో ర్యాలీని వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి ఢిల్లీలోని ప్రముఖ వ్యాపారులు, పారిశ్రామికవేత్తల సంస్థ అయిన ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ లేఖ రాసింది. ర్యాలీని దీపావళి వరకు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. పండుగల సమయంలో వ్యాపారం దెబ్బతింటుందని పేర్కొ్న్నారు.
రాహుల్ గాంధీకి రాసిన లేఖలో సీటీఐ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ ఇలా పేర్కొన్నారు. ‘నవంబర్ 1వ తేదీన రామ్‌లీలా మైదాన్‌లో మీ పార్టీ ఒక భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. ప్రస్తుతం దీపావళి వ్యాపారం జోరుగా సాగుతున్నందున ఈ ర్యాలీని నవంబర్ 10వ తేదీ వరకు వాయిదా వేయాలని మేము వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము.’’ అని కోరారు.
Also Read
- Minister Aadhav Arjuna vs Dhanush: హీరో ధనుష్‌పై టీవీకే మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదని అనుకుంటున్నారా?
- Indian Curries in TasteAtlas Top 50: ప్రపంచంలోనే టాప్ 50 టేస్టీ కూరల్లో 8 భారత్‌వే.. సత్తా చాటిన ఇండియన్ వంటకాలు
- META Smart Glasses: రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ల దుమారం.. ఆ మెటా గ్లాసెస్ మిస్టరీ ఏంటి?
- PM Kisan: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. ఆ రోజే డబ్బులు ఖాతాల్లోకి జమ..
ర్యాలీ కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు, మెట్రో స్టేషన్ల మూసివేతలు, బారికేడ్లు ఏర్పాటు చేయడం వంటివి మార్కెట్లకు పూర్తి అంతరాయం కలిగిస్తాయని పేర్కొన్నారు. ర్యాలీ సమయంలో రోడ్ల మూసివేత, జనసమూహాల వల్ల ఢిల్లీ బయట నుంచి రాకపోకలు సాగించే ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలగవచ్చని, భయం కారణంగా కొనుగోలుదారులు ఢిల్లీకి రావడం మానుకోవచ్చని.. ఇది ధంతేరస్, దీపావళి వ్యాపారంపై నేరుగా ప్రభావం చూపుతుందని గోయల్ తెలిపారు.
- Tags
- congress
- Delhi
- rahul gandhi
- Rally
తాజావార్తలు
-
Rahul Gandhi: పండుగల సమయం.. ర్యాలీ వాయిదా వేయండి.. రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
Fauzi: జీవించేశాడే.. ‘ఫౌజీ’లో సుభాష్ చంద్రబోస్‌గా నటించింది ఎవరో తెలుసా?.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
-
Stock Market Crash: నాలుగు రోజుల్లో రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్న ఐదు కారణాలు ఇవే..
-
Jakkampudi Raja: వైసీపీ అభ్యర్థిపై దాడి కేసు.. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
-
Mumbai Indians: 2027 ఐపీఎల్ కప్ లక్ష్యంగా ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. జట్టుకు కొత్త హెడ్ కోచ్ నియామకం..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!