జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం-ఒకే ఎన్నికలు అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ జమిలి ఎన్నికలకు సన్నాహాలు చేస్తు్న్నట్లు వార్తలు వెలువడుతున్న తరుణంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో అత్యంత హాట్‌స్టేట్ సీట్లలో ఒకటైన వారణాసి సీటు ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి నరేంద్ర మోడీ ఇక్కడ నుంచి మూడోసారి గెలుపొందారు. కాగా.. ఈరోజు వారణాసిలో కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తొలి రౌండ్ నుంచి మోడీ వెనుకంజలో ఉన్నారు. ఆ తర్వాత.. పుంజుకోగా 1.5 లక్షలకు పైగా ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 6 గంటలకే ప్రారంభమైన కౌంటింగ్.. ఇప్పటికే బీజేపీ సగం మార్కును దాటింది. ఈ క్రమంలో.. బీజేపీ సీఎం అభ్యర్థి పెమా ఖండూ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాగా.. రాష్ట్రంలోని 60 స్థానాల్లో 31 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాగా.. అధికార బీజేపీ ఇప్పటికే 10 అసెంబ్లీ స్థానాలను ఏకపక్షంగా గెలుచుకుంది. మిగతా 50 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది.
మునుపెన్నడు లేని విధంగా రికార్డులు తిరగరాస్తు 50 వేల మెజార్టీతో గెలిపిస్తామని ఉదయగిరి ముస్లిం మైనార్టీ సోదరులు మహిళలు కాకర్ల సురేష్ కు భరోసా ఇచ్చారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మ రాజుచెరువు సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయగిరి ముస్లిం మైనార్టీ మహిళలు ముస్లిం సోదరులు సుమారు 500 మంది టిడిపి పార్టీలో ఉదయగిరి ఇంచార్జ్ కాకర్ల సురేష్ సమక్షంలో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ.. 50వేల మెజార్టీ మెజారిటీతో ఉదయగిరి…
భారీ మెజార్టీకి మారుపేరు హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత రెండుసార్లు సిద్ధిపేట నుంచి భారీ మెజార్టీతో హరీష్ రావు గెలుపొందారు. అయితే ఈసారి హరీష్ రావు వెనకపడిపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థిగా కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కెపి వివేకానంద నిలిచారు. వివేకానంద 85 వేల 576 ఓట్ల మెజార్టీ సాధించారు. Also Read: Telangana Elections 2023: పీవీ నరసింహారావు రికార్డును అధిగమించిన శ్రీధర్ బాబు! కుత్బుల్లాపూర్…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో ఫలితం వచ్చింది. ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియపై గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దాదాపు 18వేలకు పైగా ఓట్లతో ఓటమి పాలయ్యారు.
Uttam Kumar Reddy: హుజూర్‌నగర్ నియోజవర్గంలో నేను 50 వేల మెజార్టీతో గెలుస్తా.. ఒక్క ఓటు తక్కువైనా రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. హుజూర్‌నగర్ అసెంబ్లీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆయన.. సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ ఎంపీ స్థానానికి పోటీ చేశారు.. దాంతో, హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో.. ఆయన భార్యను బరిలోకి దింపినా.. విజయం సాధించలేకపోయారు.. అయితే, వచ్చే…
ఆత్మకూరు ఉపఎన్నికలో లక్ష మెజారిటీ కోసం లక్ష పాట్లు పడ్డారు వైసీపీ నేతలు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చేశారు. బై ఎలక్షన్‌లో గెలిచినా లక్ష్యాన్ని చేరుకోకపోవడమే అధికారపార్టీ శిబిరంలో చర్చగా మారింది. ఆ అంశంపైనే పోస్టుమార్టం చేస్తున్నారట. పార్టీ నేతల అనైక్యత వల్లే లక్ష మెజారిటీ రాలేదా? ఆత్మకూరు ఉపఎన్నికలో టీడీపీ బరిలో లేకపోవడం.. బీజేపీ మాత్రమే బరిలో ఉండటంతో.. సులభంగా లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని వైసీపీ నేతలు ఆశించారు. ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా…