IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
- ఉప్పల్ మ్యాచ్ టికెట్లపై అభిమానుల ఆగ్రహం
- నిమిషాల్లో సోల్డ్ అవుట్ అయిన 39 వేల సీట్లు
- భారీగా పెరిగిన టికెట్ ధరలపై విమర్శలు
- ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియపై సందేహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలోని క్రికెట్ ప్రేమికులకు ఉప్పల్ స్టేడియం మ్యాచ్ అంటేనే ఒక పెద్ద పండుగ. అయితే, రేపు జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ టికెట్ల అమ్మకాల వెనుక పెద్ద ఎత్తున దందా నడిచిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్‌కు నగరంలో ఇదే చివరి మ్యాచ్ కావడం, దానికి తోడు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌ను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ క్యాష్ చేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా రూ. 950 గా ఉండే కనీస టికెట్ ధరను ఏకంగా రూ. 1,950 కి పెంచేయడమే కాకుండా, సౌత్ స్టాండ్ కార్పొరేట్ బాక్స్ టికెట్ ధరను రూ. 30 వేల నుండి ఒకేసారి రూ. 45 వేలకు పెంచేశారు. దీనివల్ల సామాన్య క్రికెట్ ప్రేమికులకు మ్యాచ్ చూసే అవకాశం పూర్తిగా దూరమైంది. ఇంత భారీగా ధరలు పెంచినా సరే, మ్యాచ్ చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు ఆన్లైన్ బుకింగ్స్‌లో తీవ్ర నిరాశే ఎదురైంది. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో జరిగిన ఆన్లైన్ టికెట్ సేల్స్ ప్రక్రియ ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తోంది.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
శుక్రవారం సాయంత్రం ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు ప్రారంభించిన కేవలం నిమిషాల వ్యవధిలోనే ‘సోల్డ్ అవుట్’ (Sold Out) బోర్డు ప్రత్యక్షం కావడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం మొత్తం సామర్థ్యం 39 వేల సీట్లు. ఇందులో విఐపిలు, అధికారులకు ఇచ్చే ఉచిత కాంప్లిమెంటరీ పాసులు పోను.. సుమారు 30 నుండి 32 వేల టికెట్లు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కానీ, ఆన్లైన్ సేల్స్ ప్రారంభం కాగానే దాదాపు 3 లక్షల మందిని క్యూలో చూపించి, అసలు టికెట్లు బుక్ చేసుకునే లోపే వేలాది టికెట్లు కంటికి కనిపించకుండా మాయమైపోయాయి.
ఈ టికెట్ల మాయం వెనుక తెరవెనుక పెద్ద దందా నడిచిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కంటితుడుపుగా ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ చేసి, అభిమానులను బురిడీ కొట్టించి మెజారిటీ టికెట్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ లో అసలు సాధారణ ప్రజలకు ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంచారు, ఇప్పటివరకు ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయి అనే పూర్తి వివరాలను సన్‌రైజర్స్ యాజమాన్యం బయటపెట్టకుండా దాచడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
తాజావార్తలు
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!