Breaking News : హైదరాబాద్ ప్రధాన రహదారిపై అడ్వకేట్ మల్లారెడ్డి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ములుగు-హైదరాబాద్ ప్రధాన రహదారి పందికుంట స్టేజి వద్ద అడ్వకేట్ మల్లారెడ్డి పై సినీ పక్కిలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హతమార్చిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ములుగు జిల్లా కేంద్రం నుంచి మల్లంపల్లి వైపునకు అడ్వకేట్ మల్లారెడ్డి తన సొంత వాహనంలో వెళ్తుండగా, జాతీయ రహదారి పందికుంట స్టేజీ వద్ద మాటువేశారు దుండగులు. అయితే.. స్విఫ్ట్ కారులో వచ్చిన ఐదుగురు మల్లారెడ్డి వెళ్తున్న ఇన్నోవా కారును అటకాయించి, ఆ తర్వాత డ్రైవర్‌ను చితకబాది, ఆ తర్వాత కత్తులు, గొడ్డళ్లతో మల్లారెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడికి నుంచి పారిపోయారని డ్రైవర్ వెల్లడించారు.
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మల్లారెడ్డి వృత్తిరీత్యా న్యాయవాది కాగా.. ఆయన మైనింగ్ వ్యాపారం సైతం నిర్వహిస్తున్నారు. అలాగే ములుగు మండలం మల్లంపల్ల గ్రామంలో పెట్రోల్ పంపు సైతం ఉన్నది. అయితే, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!