NTV Telugu Site icon

Piyush Goyal: ప్రధానిని, నన్ను అవమానకరంగా తిట్టినా.. రైతుల కోసం ఈ నిర్ణయం

Piyush Goyal

Piyush Goyal

Union Minister Piyush Goyal’s comments on TRS: టీఆర్ఎస్ నాయకులు ప్రధాని నరేంద్రమోదీని, నన్ను అవమానకరంగా తిట్టారని, పేదలకు బియ్యం అందకుండా అన్యాయం చేశారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. తెలంగాణలో వడ్లు, బియ్యం సేకరణ చేయాలని ఎఫ్ సీ ఐని ఆదేశించినట్లుగా ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు. పేదలకు బియ్యం అందకుండా చేసిందని.. ఏప్రిల్, మే నెలల్లో బియ్యం ఇవ్వకుండా పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. రైస్ మిల్లుల్లో అక్రమాలు జరిగాయిని..అందుకే మేము ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. మేము తీసుకున్న చర్యల వల్లే ఇప్పుడు బియ్యం సరఫరా చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పులకు రైతులను బలి చేయడం సరికాదని పియూష్ గోయల్ అన్నారు. వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.

Read Also: Kishan Reddy: తెలంగాణకు మరో 20 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల

బియ్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర నిర్ణయించింది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

కేంద్ర ప్రభుత్వం రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేదని.. ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్య రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్ల రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని.. కానీ పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. సివిల్ సప్లై అధికారులతో మాట్లాడానని.. ఇంకా ఆదేశాలు రాలేదని వారు వెల్లడించారని కిషన్ రెడ్డి వెల్లడించారు. పేదలకు ఇవ్వాల్సిన ఉచిత బియ్యాన్ని రాష్ట ప్రభుత్వం దగ్గర పెట్టుకొని పంచడం లేద.. ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా ఎందుకు చేశారో తెలియడం లేదని సెటైర్లు వేశారు. నూకలు కొంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని..కమిటీ వేసిందని అయినా ఇప్పటి వరకు ఏమి కాలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తుందని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో రైస్ డిస్ట్రిబ్యూషన్, ప్రొక్యూర్మెంట్ చేయాలని రాష్ట్రాలతో, రైస్ మిల్లర్లతో మాట్లాడామని కిషన్ రెడ్డి తెలిపారు. రైస్ మిల్లర్లు అక్రమాలు చేశారు.. కేసులు నమోదు అయ్యాయని.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.