టీఆర్ఎస్ నాయకులు ప్రధాని నరేంద్రమోదీని, నన్ను అవమానకరంగా తిట్టారని, పేదలకు బియ్యం అందకుండా అన్యాయం చేశారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. తెలంగాణలో వడ్లు, బియ్యం సేకరణ చేయాలని ఎఫ్ సీ ఐని ఆదేశించినట్లుగా ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు. పేదలకు బియ్యం అందకుండా చేసిందని.. ఏప్రిల్, మే నెలల్లో బియ్యం ఇవ్వకుండా పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు.