జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి(ఎన్డీఆర్ఎఫ్) కింద కేంద్ర తెలంగాణకు ఎటువంటి సాయం చేయలేదని విమర్శిస్తున్న టీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణకు విపత్తుల సహయ నిధుల కింది రూ. 3000 కోట్లను కేంద్రం విడుదల చేసిందన్నారు. ఇందులో 2018 నుంచి రూ. 1500 కోట్లు విడుదల చేసిందని గణాంకాలతో సహా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.