NTV Telugu Site icon

Kishan Reddy Letter to KCR: పీఎం మిత్రలో చేరండి..

ఈ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్‌ నేతలు… కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధుల వ్యవహారం నుంచి.. రాజకీయ విమర్శల వరకు ఈ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమన్న చందంగా ఉంది పరిస్థితి.. అయితే, ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.. పీఎం మిత్రలో చేరాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. దాని కోసం ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.. వస్త్ర పరిశ్రమని ప్రోత్సహించడానికి ఈ పీఎం మిత్ర కార్యక్రమం ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేర్కొన్న ఆయన.. గత నెల 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జౌళి, వస్త్ర పరిశ్రమ శాఖ లేఖ రాసిందని.. తన లేఖలో గుర్తుచేశారు..

Read Also: Raja Singh on EC Notice: నేను తప్పు చెప్పలే.. ఈసీకి వివరణ ఇస్తా..

ఇక, వచ్చే నెల 15వ తేదీ వరకు ప్రతిపాదనలు పంపించాలని కోరిన కిషన్‌రెడ్డి.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అసలే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని పథకాలను తెలంగాణ సర్కార్‌ వ్యతిరేకిస్తూనే వస్తుంది.. అంతకంటే మిన్నగా.. తమ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయని చెబుతూ వస్తుంది.. ఈ తరుణంలో.. పీఎం మిత్రలో చేరుతుందా? లేదా?.. కిషన్‌ రెడ్డి లేఖపై సీఎం కేసీఆర్‌ ఎలా స్పందిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

Show comments