కేంద్ర ప్రభుత్వం తరపున తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలకి ఈ రోజు కన్నా పండుగ మరొకటి ఉండదు. 17 సెప్టెంబర్ చరిత్రాత్మక రోజు అధికారికంగా నిర్వహించకుండా కాంగ్రెస్, తెరాస లు అన్యాయం చేస్తున్నాయి… ఇది దుర్మార్గం. ఇప్పటికైన కేసీఆర్ తప్పును తెలుసుకొని అమరుల ఆత్మ కు శాంతి చేకూరేలా ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని అన్నారు. రజాకార్ల నేత కాశిం రజ్వి పెట్టిన పార్టీ ఎంఐఎం. మజ్లీస్ కనుసైగల్లో కాంగ్రెస్ పని చేస్తుంది. తెరాస కూడా మజ్లీస్ చేతిలో కీలు బొమ్మ అని తెలిపారు కిషన్ రెడ్డి. తెలంగాణ ఆత్మ గౌరవ సమస్య , ఆకాంక్షల సమస్య. మజ్లీస్ ఇది చెబితే అది అమలు అవుతుంది.
సీఎం కేసీఆర్, ఒవైసీ కుటుంబాలు తెలంగాణ ప్రజలను తమకి బానిసలుగా ఉండాలని కోరుకుంటున్నాయి. చరిత్ర ను తొక్కి పెట్టె ప్రయత్నం జరుగుతుంది అన్నారు. సెప్టెంబర్ 17 అన్ని పార్టీలు చేయాల్సి న పరిస్థితి వచ్చింది.. కానీ ప్రభుత్వ పరంగా గ్రామ గ్రామాన జరగాలి. కుహనా లౌకిక వాదులకి, ఓటు బ్యాంకు రాజకీయాలకు బుద్ధి చెప్పాలి. కేసీఆర్ వైఖరి ని మజ్లీస్ దౌర్జన్యాన్ని ప్రజలు ఖండించాలి. బీజేపీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం సెప్టెంబర్ 17 ని అధికారికంగా నిర్వహించే ఫైల్…రెండో సంతకం తెలంగాణ విమోచన చరిత్ర ను పాఠ్య పుస్తకాలలో పెడుతూ సంతకం పెడుతుంది అని పేర్కొన్నారు.