Ukraine Crisis: ఉక్రెయిన్ లో కరీంనగర్ యువతి అవస్థలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో విదేశీయులు ముఖ్యంగా అక్కడ విద్యాభ్యాసం కోసం వెళ్ళిన భారతీయులు నానా అవస్థలు పడుతున్నారు. తెలుగు విద్యార్ధులు నానా కష్టాలు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. కరీంనగర్ జిల్లా రామచంద్రాపురం ప్రాంతానికి చెందిన యువతి కడారి సుమాంజలి ఉక్రెయిన్ లో ఇక్కట్లు పడుతోంది. ఆమె అవస్థలు అన్నీ ఇన్నీకావు. 4 రోజుల నుంచి ఆహారం కూడా లేదని ఆమె ఆవేదన చెందుతోంది. కూతురి కష్టాలు చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఎంబసీ అధికారులు భోజన సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.
తమ కూతురు రూంలో వుందన్నారు సుమాంజలి తల్లి. అక్కడి పరిస్థితి బాంబులు పడుతున్నాయి. ఎయిర్ పోర్ట్ లో వున్నా.. సరైన వసతి లేదు. బోర్డర్ రావడానికే అవకాశం లేదంటోంది సుమాంజలి. బాంబు చప్పుడు వినిపిస్తే బంకర్లలోకి వెళుతున్నారు. షాపుల్లో ఏం దొరకడం లేదన్నారు. కేంద్రం వెంటనే స్పందించాలని, క్షేమంగా ఇంటికి చేర్చాలంటున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో సుమాంజలి ఇరుక్కుపోయింది. అక్కడినించి సరిహద్దులు దాటాలంటే 800 కిలోమీటర్లు దూరం వుందన్నారు సుమాంజలి అన్న.
Also Read
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
మరోవైపు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ గంగ కొనసాగుతోంది. బుడాఫెస్ట్ నుంచి ఢిల్లీకి చేరుకుంది ప్రత్యేక విమానం. ఢిల్లీకి చేరుకున్నారు 240 మంది భారతీయులు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి 1346 మంది భారతీయులను తరలించారు.
తాజావార్తలు
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!