మనిషి ఏ నొప్పినైనా భరించగలడు గానీ ఆకలి బాధను భరించలేడు. ఉదయం కొంచెం లేటుగా టిఫిన్ చేస్తేనే నీరస పడిపోతారు. స్పృహ తప్పి పడిపోతారు. అలాంటిది కొద్ది నెలలుగా గాజా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక చిన్న పిల్లలు, వృద్ధులు తిండి లేక నీరసించిపోతున్నారు. దీంతో చాలా మంది ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు కూడా వదలుతున్నారు. తాజాగా ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో విదేశీయులు ముఖ్యంగా అక్కడ విద్యాభ్యాసం కోసం వెళ్ళిన భారతీయులు నానా అవస్థలు పడుతున్నారు. తెలుగు విద్యార్ధులు నానా కష్టాలు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. కరీంనగర్ జిల్లా రామచంద్రాపురం ప్రాంతానికి చెందిన యువతి కడారి సుమాంజలి ఉక్రెయిన్ లో ఇక్కట్లు పడుతోంది. ఆమె అవస్థలు అన్నీ ఇన్నీకావు. 4 రోజుల నుంచి ఆహారం కూడా లేదని ఆమె ఆవేదన చెందుతోంది. కూతురి కష్టాలు చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఎంబసీ అధికారులు…
జవాద్ తుఫాను మత్స్యకారులకు కష్టాలు మిగిల్చింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని మత్స్యకారులు ఇళ్ళకే పరిమితం అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం చేరుకున్నాయి ఎస్ డిఆర్ఎఫ్ బృందాలు. 44మంది సిబ్బందితో తీర ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో మత్స్యకారులు సముద్రతీరంలోకి వెళ్ళడం మానేశారు. ఇటు విజయనగరం జిల్లాలో తుపాన్ ఎఫెక్ట్ తో నాలుగు రోజులు గా వేటకి వెళ్లలేదు మత్స్యకారులు. అయినా అధికారులు తమను, తమ కుటుంబాలను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం…