ఖమ్మం జిల్లాలో సంచలనం రేపిన తమ్మినేని క్రిష్ణయ్య హత్యకేసులో మరో ఇద్దరు లొంగిపోయారు. ఏ9, ఏ10 నిందితులు తమ్మినేని కోటేశ్వరరావు, నాగయ్య లొంగుపోయారు. ఖమ్మం జిల్లా రెండో అదనపు జడ్జి ఎదుట నిందితులు లొంగిపోయారు. ఆగస్టు 15న తెల్దార్ పల్లిలో తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఇప్పటికే రిమాండ్ లో ఉన్న 8మంది నిందితులను అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇద్దరు లొంగిపోవడంతో.. మొత్తం 10 మంది లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఆగస్టు 20 పోలీసు దర్యాప్తుపై కుటుంబీకుల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పోలీసులు కోర్టుకు నివేదించిన రిమాండ్ రిపోర్టుపై క్రిష్ణయ్య , ప్రధాన సూత్రధారి కోటేశ్వరరావు పేరు లేదంటూ కృష్ణయ్య కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేసారు. కేసు దర్యాప్తులో పోలీసుల తీరు సరిగా లేదని తమ్మినేని కృష్ణయ్య హత్యకు కోటేశ్వరరావు కుట్ర చేసారని పోలీసులకు ఫిర్యాదు చేసిన కోటేశ్వరరావు పేరు లేకుండానే రిమాండ్ రిపోర్టు కోర్టులో సమర్పించారని కన్నీరు పెట్టుకున్నారు. ఒత్తిళ్లతోనే కేసులో ప్రధాన సూత్రధారి పేరు లేకుండా చేశారని మండిపడ్డారు. మాకు న్యాయం చేయకపోతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. తమ్మినేని కృష్ణయ్యను ఏ1 గా చేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ తమ్మినేని కృష్ణయ్య కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్న విషయం తెలిసిందే.
ఆగస్టు 15న ఖమ్మం జిల్లా తెల్దార పల్లిలో టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని తమ్మినేని కృష్ణయ్యను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జెండా ఎగురవేసిన తర్వాత కృష్ణయ్య బైక్‌పై వెళ్లగా.. ఆయన్ను వెంబడించి దుండగులు హతమార్చారు. ఈ ఎటాక్‌లో కృష్ణయ్య స్పాట్‌లోనే మృతి చెందారు. పక్కా ప్లాన్ ప్రకారమే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య ఈహత్య జరిగినవిషయం తెలిసిందే. అయితే రెండురోజుల్లోనే (ఆగస్టు 18న) తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులను ఏపీలో పోలీసులు అరెస్టు చేసారు.
ఖమ్మం జిల్లా తెల్దార పల్లి గ్రామానికి చెందిన తమ్మినేని కోటేశ్వర రావు సలహా మేరకే ఏడుగురు వ్యక్తులు కృష్ణయ్య హత్యలో పాల్గొన్నారు. తమ్మినేని కృష్ణయ్య కుమారుడు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ్మినేని కోటేశ్వరరావుతో పాటుగా ఎనిమిది మందిని ఈ కేసుల నిందితులుగా చేర్చారు. వారిమీద 148, 341, 132, 302, 149 సెక్షన్ క్రింద కసులు నమోదు చేశారు. నిందితులన పట్టుకునేందుకు నాలుగు టీంలను ఏర్పాటు చేశారు పోలీసులు. కాగా A1 గా ఉన్న తమ్మినేని కోటేశ్వరరావు , కృష్ణ మినహా మిగిలిన వారందరిని పోలీసులు అరెస్టు చేసారు. A2 గా ఉన్న రంజాన్, A4 గంజి స్వామి, A5 నూకల లింగయ్య, A6 బోడపట్ల శ్రీను, A7 నాగేశ్వరరావు A8 ఎల్లంపల్లి నాగయ్యను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు A1 గా ఉన్న తమ్మినేని కోటేశ్వరరావు , కృష్ణ ఇద్దరు లొంగిపోవడంతో.. మొత్తం 10మంది కూడా పోలీసుల అదుపులో వున్నారు. అయితే వీరిపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది ప్రతిఒక్కరికి ఆసక్తిగా మారింది. అయితే వారిద్దరు ఇన్ని రోజులు ఎక్కడ తల దాచుకున్నారు. అనేది ప్రశ్నార్థంగా మారింది. ఇన్నిరోజుల తరువాత ఇవాళ వచ్చి లొంగిపోవడం ఏంటని ప్రశ్నలు మొదలయ్యాయి.
Harassment a Married Woman: వేరొకరితో పెళ్లైన ప్రియురాలిని కిడ్నాప్ చేసిన ప్రియుడు.. తరువాత!